
బీహార్ : మహిళ మోజులో పడి దేశ భద్రతకు సంబంధించిన వివరాలను శత్రుదేశానికి అందించిన భారత రక్షణ శాఖ మాజీ ఉద్యోగిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేసారు. పాకిస్థాన్ కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఓ మహిళా ఏజెంట్ ను రక్షణ శాఖ ఉద్యోగికి ఎరగావేసి దేశ రక్షణకు సంభందించిన సున్నితమైన సమాచారాన్ని సేకరించినట్లు జాతీయ భద్రతా సంస్థ గుర్తించింది. దీంతో సదరు మాజీ రక్షణశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
వివరాల్లోకి వెళితే... బిహార్ ముజప్పర్ పూర్ జిల్లాలో రిజిస్ట్రార్ కార్యాలయంలో క్లర్ గా పరిచేసే రవి చౌరాసియా మాజీ రక్షణ శాఖ ఉద్యోగి. అతడు గతంలో తమిళనాడు రాజధాని చెన్నైలో రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్ గా పనిచేసాడు. ఈ సమయంలోనే అతడికి సోషల్ మీడియా ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే పూర్తిగా మహిళ మాయలో పడిపోయిన రవి దేశద్రోహానికి పాల్పడ్డాడు.
Read More మహిళ రేప్ చేసినట్టు మైనర్ బాలిక ఫిర్యాదు.. ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?
అయితే రవికి వలపువల విసిరి భారత రక్షణ సమాచారాన్ని రాబట్టిన మహిళ ఐఎస్ఐ ఏజెంట్ గా భారత భద్రతా సంస్థ తాజాగా గుర్తించింది. రవి గతంలో కీలకమైన సమాచారాన్ని పాక్ గూఢచర్య సంస్థకు చేరవేసినట్లు అతడి ఫోన్ కాల్, వాట్సాప్, ఈ మెయిల్ చాటింగ్ ద్వారా నిర్దారణ అయ్యింది. దీంతో భారత భద్రతా సంస్థ ఆదేశాలమైరకు రవి చౌరాసియాను అరెస్ట్ చేసారు బిహార్ పోలీసులు. అతడిపై అధికారిక రహస్యాల శత్రు దేశాలకు చేరవేసినందుకు దేశద్రోహంతో పాటు మరికొన్ని చట్టాల కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు బిహార్ పోలీసులు.