Coronavirus: దేశంలో ఒమిక్రాన్ ఉప్పెన కొనసాగుతున్న తరుణంలో యాక్టివ్ కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్య 5 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటున్నదని కేంద్రం పేర్కొంది. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందనీ, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉప్పెన కారణంగా ప్రస్తుత పరిస్థితులు వేగంగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది.
Coronavirus: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ గజగజ వణికిస్తున్నది. 2019లో చైనాలో వెలుగుచూసిన ఈ కోవిడ్ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే అన్ని దేశాలకు వ్యాపించింది. నిత్యం అనేక మ్యుటేషన్లకు లోనవుతూ అత్యంత ప్రమాదకారిగా మారుతోంది. ఇదివరకు Coronavirus డెల్టా వేరియంట్ అన్ని దేశాల్లోనూ పంజా విసిరి.. లక్షలాది మంది ప్రాణాలు తీసుకోగా.. ప్రస్తుతం దాని కంటే ప్రమాదకరమైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ విజృంభిస్తోంది. దీంతో మళ్లీ కరోనా బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. భారత్ లోనూ ఒమిక్రాన్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కరోనా వైరస్ (Coronavirus) కొత్త కేసులు లక్షన్నరకు పైగా నమోదుకావడం కోవిడ్-19 ఉధృతికి అద్దం పడుతున్నది. మరణాలు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనావైరస్ సోకిన వారిలో దాదాపు 10 శాతం వరకు యాక్టివ్ కేసులు ఆస్పత్రిలో చేరాల్సి వస్తున్నదనీ, ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మాట్లాడుతూ.. దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయని అన్నారు. దేశంలో కరోనా (Coronavirus) సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగిన సమయంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడిన యాక్టివ్ కేసులు 20 శాతం నుంచి 23 శాతం పరిధిలో ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఒమిక్రాన్ ఉప్పెన కొనసాగుతున్న తరుణంలో యాక్టివ్ కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతున్న వారి సంఖ్య 5 శాతం నుంచి 10 శాతం వరకు ఉంటున్నదని తెలిపారు. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోందనీ, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉప్పెన కారణంగా ప్రస్తుత పరిస్థితులు వేగంగా మారుతున్నాయని తెలిపారు. దీని కారణంగా మున్ముందు Coronavirus ఉధృతి కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు.
undefined
ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తిని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని కేంద్రం పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్న Coronavirus కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, ఐసోలేషన్ పరిస్థితులు, ఆస్పత్రుల్లో చేరికలు, ఐసీయూ బెడ్లు, ఆక్సిజన్ పడకల లభ్యత, వెంటిలేటర్ సపోర్ట్ సర్వీసులు గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పై అంశాలను పరిగణలోకి తీసుకుని కరోనా కసులు పెరిగితే.. వైద్య సిబ్బందిపై భారం పడకుండా, మందుల కొరత ఏర్పడకుండా ముందుస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు పెరుగుదలతో పాటు కోవిడ్-19 కేసుల పెరుగుదల గణనీయంగా చోటుచేసుకుందని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది. డెల్టాతో పాటు ఒమిక్రాన్, ఇతర వేరియంట్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆరోగ్య వ్యవస్థ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
ఇదిలావుండగా, దేశంలో కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. దీంతో రోజువారీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,79,723 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. అలాగే, కరోనాతో 146 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,936కి చేరింది. నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 46,569 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,00,172కి చేరింది. ఇక, ప్రస్తుతం దేశంలో 7,23,619 కరోనా (Coronavirus) యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం రోజులు దేశంలో 29,60,975 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల పంపిణీ 1,51,94,05,951 కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 69,15,75,352 Coronavirus పరీక్షలు నిర్వహించారు.