తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి

Published : Jul 27, 2019, 12:17 PM ISTUpdated : Jul 27, 2019, 12:21 PM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి

సారాంశం

 కేరళకు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా... ఎదురుగా వస్తున్న ఓ లారీ పాలక్కాడ్- సాలెం రహదారిపై శనివారం ఉదయం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు.

తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...కేరళకు చెందిన ఓ కుటుంబం కారులో వెళుతుండగా... ఎదురుగా వస్తున్న ఓ లారీ పాలక్కాడ్- సాలెం రహదారిపై శనివారం ఉదయం ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు.

ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కారు డ్రైవర్ సహా ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. కారు డ్రైవర్ మహ్మద్ బషీర్ ఒడిశాకుచెందిన వ్యక్తిగా గుర్తించారు. వారంతా జీవనోపాధి నిమిత్తం వలస వస్తూ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

PREV
click me!

Recommended Stories

Ration Card: భారీగా రేష‌న్ కార్డుల‌ను నిలిపివేయ‌నున్న ప్ర‌భుత్వం.. జాబితాలో మీది ఉందా.?
Bank Holidays : ఈ శనివారం బ్యాంకులకు సెలవుందా? రేపట్నుంచి వరుసగా మూడ్రోజులు సెలవేనా?