వివాహ కార్యక్రమం నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు..

Published : May 05, 2023, 10:46 AM IST
వివాహ కార్యక్రమం నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి, 10 మందికి గాయాలు..

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రైచ్-లక్నో హైవేపై కైసర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదానీ హాస్పిటల్ సమీపంలో టెంపోను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 


ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహ్రైచ్-లక్నో హైవేపై కైసర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదానీ హాస్పిటల్ సమీపంలో టెంపోను ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి కొందరు వ్యక్తులు వివాహ కార్యక్రమానికి నుంచి  అహిరాన్‌ పూర్వాకు టెంపోలో తిరిగి వస్తుండగా రాంగ్‌ సైడ్‌ నుంచి వస్తున్న ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.

Also Read: డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో దంపతుల అరెస్ట్.. పెళ్లైనా తర్వాత కూడా కొనసాగిన బంధం.. చివరకు ఇలా..

ఈ ఘటనలో మృతిచెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నాడని  పోలీసులు చెప్పారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు.  
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..