ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనాలు.. మేఘాలయలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2గా నమోదు..

By Rajesh KarampooriFirst Published Oct 2, 2023, 10:23 PM IST
Highlights

EarthQuake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. సోమవారం సాయంత్రం 6:15 గంటలకు మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.

EarthQuake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపం కుదిపేసింది. అసోం, మేఘాలయల్లో సోమవారం భూకంపం సంభవించింది. మేఘాలయ రాష్ట్రంలో రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం కథనం ప్రకారం.. సోమవారం (అక్టోబర్ 2) సాయంత్రం 6:15 గంటలకు మేఘాలయలోని నార్త్ గారో హిల్స్‌లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం గురించి జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం అందించింది.

అస్సాంతో సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం గురించి జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సమాచారం అందించింది. ఉత్తర గారో హిల్స్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీని కేంద్రం జిల్లా కేంద్రమైన రెసుబెల్‌పరా నుండి 3 కి.మీ దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. అయినా.. భూకంపం వల్ల ఏదైనా నష్టం జరిగిందా? లేదా? అనే విషయంపై ఇంకా అప్‌డేట్ రాలేదు. 
  
వార్తా సంస్థ PTI ప్రకారం.. మేఘాలయతో పాటు, అస్సాం, పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర భాగం, సిక్కిం వంటి సమీప రాష్ట్రాలలో కూడా భూకంపం సంభవించింది. షిల్లాంగ్‌లోని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి మాట్లాడుతూ.. “ప్రాణ లేదా ఆస్తి నష్టం గురించి మాకు ఎటువంటి నివేదిక అందలేదు“. అని తెలిపారు. 

ఇతర నివేదికలలో అక్టోబర్ 2 సెలవుదినం కావడంతో, చాలా మంది సాయంత్రం వారి ఇళ్లలో ఉన్నారు. భూకంప ప్రకంపనల కారణంగా భయాందోళనలకు గురయ్యారు. ఈశాన్య రాష్ట్రాలు అధిక భూకంప జోన్‌లో ఉండడం, భూకంపాలు తరచూ సంభవిస్తుండడం గమనార్హం.

హర్యానాలో భూకంపం 

అంతకుముందు ఆదివారం (అక్టోబర్ 1) రాత్రి 11:26 గంటలకు హర్యానాలోని రోహ్‌తక్‌లో 2.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంప కేంద్రం రోహ్‌తక్‌కు తూర్పు ఆగ్నేయంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భూమికి ఐదు కిలోమీటర్ల దిగువన ఉంది. 

click me!