మహిళ సహా 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. హల్ద్వానీ జైలులో పరిస్థితి ఇదీ

Published : Apr 09, 2023, 12:44 AM IST
మహిళ సహా 44 మంది ఖైదీలకు హెచ్ఐవీ.. హల్ద్వానీ జైలులో పరిస్థితి ఇదీ

సారాంశం

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జైలులో కనీసం 40 మందికి ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ అని వచ్చింది. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నది. కాగా, అధికారులు మాత్రం ఈ ఉదంతంపై స్పందించడం లేదు.  

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జైలులో హెచ్ఐవీ పాజిటివ్ ఖైదీలు 40కి పైగా ఉన్నారు. ఇది పెద్దగా బయటకు రాకున్న అంతర్గతంగా మాత్రం కలకలం రేపుతున్నట్టు తెలుస్తున్నది. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్కరూ ఈ విషయంపై మాట్లాడటం లేదు. హల్ద్వానీ జైలులో 44 మందికి హెచ్ఐవీ పాజిటివ్ వచ్చింది. వీరందరినీ హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తున్నారు.

హెచ్ఐవీ పాజిటివ్ వచ్చిన ఖైదీలలో ఒక మహిళ కూడా ఉండటం కలకలం రేగుతున్నది. వీరిని  సుశీల్ తివారీ హాస్పిటల్ చికిత్స అందిస్తున్నది. ఈ హాస్పిటల్ నుంచి ప్రత్యేక టీం జైలుకు వెళ్లి అ్కడ రోటీన్ చెకప్ చేస్తున్నదని సుశీల్ తివారీ హాస్పిటల్‌లోని డాక్టర్ పరంజీత్ సింగ్ తెలిపారు.

స్వల్ప లక్షణాలు ఉన్న వారికి స్పాట్‌లోనే మెడిసిన్స్ అందిస్తున్నట్టు డాక్టర్ పరంజీత సింగ్ వివరించారు. జైలు అధికారులు కూడా రోటీన్ చెకప్‌లు నిర్వహిస్తున్నారు. తద్వార ఖైదీల్లో ఎవరికైనా హెచ్ఐవీ పాజిటివ్ అని తేలితే వారిని వేగంగా సకాలంలో చికిత్స చేయడానికి అవకశం ఉంటుందని భావిస్తున్నారు. హెచ్ఐవీ పేషెంట్ల కోసం యాంటీ రిట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.

Also Read: పార్టీ కార్యకర్తతో ప్రధాని మోడీ స్పెషల్ సెల్ఫీ.. ‘ఆయనతో పార్టీలో ఉండటం గర్వంగా ఉంది’

తమ టీమ్ ప్రతి రోజూ జైలులోని ఖైదీలను చెక్ చేస్తున్నామని ఆ డాక్టర్ తెలిపారు. ఈ చెకింగ్‌లో ఎవరికైనా హెచ్ఐవీ పాజిటివ్ అని తాము ఆ ఖైదీలకు ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. 

హెచ్ఐవీ, ఎయిడ్స్ అనేక మార్గల్లో వ్యాపిస్తుంది. దాన్ని కేవలం ఒకే కోణంలో చూడరాదు. 

ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించాల్సి ఉన్నది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?