ఢిల్లీలోని ఒకే భవనంలో 44 మందికి కరోనా పాజిటివ్

By telugu team  |  First Published May 2, 2020, 5:06 PM IST

ఢిల్లీలోని ఒకే భవనంలో 44 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఏప్రిల్ 18వ తేదీన ఆ భవనంలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. ఆ తర్వాత పరీక్షల్లో మరో 44 మందికి కరోనా సోకినట్లు తేలింది.


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. ఆగ్నేయా ఢిల్లీలోని కపాషేరా ప్రాంతంలో ఒకే భవనంలో ఉంటన్న 44 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ భవనంలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు ఏప్రిల్ 18వ తేదీన తేలింది. 

దాంతో అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. అందులో ఉంంటున్న 175 మంది శాంపిల్స్ ను సేకరించి కరోనా వైరస్ నిర్ధారణకు పరీక్షలకు పంపించారు. శనివారంనాడు 67 మంది ఫలితాలు వచ్చాయి. వారిలో 44 మందకి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. మిగిలినవారి ఫిలతాలు రావాల్సి ఉంది. ఆ ఫలితాలు వస్తే కేసుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు అంటున్నారు.  

Latest Videos

ఢిల్లీలో ఇప్పటి వరకు 3,738 కరోనా కేసులు నమోదయ్యాయి. 61 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. మొత్తం 11 జిల్లాల్లోనూ వైర్ తీవ్రంగా ఉంది. దీంతో వాటిని రెడ్ జోన్లుగా గుర్తించింది. మే 17వ తేదీ వరకు అన్ని జిల్లాలు కూడా రెడ్ జోన్లలోనే ఉంటాయని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ చెప్పారు. 

పదికి మించి కేసులు ఉన్న జిల్లాలన్నింటినీ రెడ్ జోన్ పరిధిలో చేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర మార్గదర్శ సూత్రాలకు అనుగుణంగానే సహాయక చర్యలు ఉంటాయని చెప్పారు. 

click me!