అత్యధికంగా మహారాష్ట్రలో 206619 కేసులు నమోదవగా..8822 మంది చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే( జూలై 5)1,80,596 టెస్టులు చేశారు.
భారత్ లో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 24,248 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 425 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,413 కు చేరగా మరణాల సంఖ్య 19,693 కు చేరింది.
మొత్తం 4,24,433 మంది డిశ్చార్జ్ అయ్యారు. 2,53,287 మంది చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 206619 కేసులు నమోదవగా..8822 మంది చనిపోయారు. ఇక దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే( జూలై 5)1,80,596 టెస్టులు చేశారు. జూలై 5 వరకు భారత్ లో మొత్తం 99,69,662 మందికి టెస్టులు చేశారు.
ఇదిలా ఉండగా... ఇక తాజాగా నమోదైన కేసులతో భారత్ రష్యాను అధిగమించి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది.
రష్యాలో ఇప్పటివరకు 6,81,251 కరోనా కేసులు నమోదుకాగా.. భారత్‌లో 6,97,396 కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా, బ్రెజిల్ తరువాతి స్థానంలో ఇప్పుడు భారతదేశం నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ విషయంలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది.
భారత్‌లో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాని ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. తమిళనాడులో 4,200కు పైగా, ఢిల్లీలో 2,500కు పైగా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ మార్చి నెలాఖరు నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. ప్రపంచదేశాల కంటే భారత్ లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయగలిగింది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో దేశంలో కేసులు పెరుగుతూ పోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్తోనూ వైరస్ ప్రభావం బాగా పెరుగుతోంది. తెలంగాణలో 23వేల కేసు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో కేసులు 20వేలకు చేరువలో ఉండటం గమనార్హం.