మరోవైపు దేశంలోని 81 జిల్లాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదై, అక్కడి ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. ఇదేవిధంగా దేశంలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి డేటా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. మన దేశంలోనూ కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలలో ఈ కరోనా వైరస్ విషయంలో భారత్ మూడో స్ధానానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 7లక్షల కేసులు నమోదయ్యాయి. ఇక మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.
అయితే.. మన దేశంలోనూ ఒక్క కరోనా కేసు కూడా నమోదవ్వని ప్రాంతాలు ఉన్నయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు దేశంలోని 81 జిల్లాల్లో వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదై, అక్కడి ప్రజలకు దడ పుట్టిస్తున్నాయి. ఇదేవిధంగా దేశంలో కరోనా కేసులకు సంబంధించి పూర్తి డేటా అందుబాటులో ఉండటం లేదని తెలుస్తోంది.
దేశంలోని లక్షద్వీప్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, జమ్ము కశ్మీర్‌లలోని 16 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాగే 250కి పైగా జిల్లాల్లో 100 కన్నా తక్కువ, 143 జిల్లాల్లో 100 నుంచి 200 కేసులు ఉన్నాయి.
మరోవైపు కనీసంగా 70 జిల్లాల్లో అధికారికంగా 1,000కి పైగా కేసులు నమోదయ్యాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో, రాష్ట్ర రాజధాని ప్రాంతంలో అత్యధిక కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలోని 2 లక్షల కేసులలో 42 శాతం ముంబైలోనే ఉన్నాయి. అలాగే తమిళనాడులోని 1.07 లక్షల కేసుల్లో 62 శాతం చెన్నైలోనే ఉన్నాయి.