
మధ్యప్రదేశ్ : ముగ్గురు మహిళలతో 15 యేళ్లుగా ఓ వ్యక్తి Live-in Relationship చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికమీద సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను Marriage చేసుకున్నాడు. ఈ వార్త సోమవారం మీడియాలో viral గా మారింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్ లోని Tribal తెగకు చెందిన సమర్థ్ మౌర్య (42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ సందర్భంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పాడినట్లు తెలిపాడు. ఆ తరువాత మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్ బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానకి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 18న గుంటూరు జిల్లా palnadu జిల్లాలో ఇటీవల ఓ యువతి గొంతు కోసి పారిపోయిన నిందితుడు తులసీరామ్ ను సత్తెనపల్లి పోలీసులు arrest చేశారు. పల్నాడుజిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ… దాచేపల్లికి చెందిన Sheikh Fatima భర్తతో విడిపోయి గత ఆరు నెలల నుంచి సత్తెనపల్లి పాత బస్టాండ్ ప్రాంతంలో Janasena Office ఎదురుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. కొంతకాలంగా గురజాలకు చెందిన తులసీరామ్ తో ఆమె సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలని తులసిరామ్ ను కోరింది.
ఈ విషయంలో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఫాతిమా ఎంత చెప్పినా వినకపోవడంతో ఆవేశంతో ఉన్న తులసిరామ్ ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఆ రోజు అంబేద్కర్ జయంతి కావడంతో తాలూకా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పార్టీ కార్యాలయానికి వస్తుండగా రోడ్డుపై రక్తపు మడుగులో ఉన్న ఫాతిమాను గమనించారు. వెంటనే స్పందించిన జనసేన నాయకులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం అందజేశారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సత్తెనపల్లి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు తులసి రామ్ కోసం బృందాలుగా ఏర్పడి గాలించారు. పట్టణంలోని చెక్పోస్ట్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం యువత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అని ఎస్పీ వివరించారు. హత్యాయత్నం జరిగిన 36 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్న సత్తనపల్లి డిఎస్పి విజయ భాస్కర్ రెడ్డి నేతృత్వంలోని బృందాన్ని ఎస్పీ అభినందించారు.