
న్యూఢిల్లీ: Nepal లో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi నైట్ క్లబ్ కు హాజరైన వీడియోను BJP విడుదల చేసింది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటరిచ్చింది. మాజీ కేంద్ర మంత్రి Prakash Javadekar మద్యం బాటిల్ తో ఉన్న ఫోటోను కాంగ్రెస్ నేత Manickam Tagore ర్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలని ఠాగూర్ ప్రశ్నించారు.
నేపాల్ జరిగిన పెళ్లికి రాహుల్ గాంధీ సోమవారంనాడు హాజరయ్యారు. నేపాల్‌కు చెందిన సుమ్నిమా ఉదాస్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఖాట్మండ్‌కు వెళ్లారు. ఆమె గతంలో సీఎన్‌ఎన్ వార్తా సంస్థలో కరస్పాండెంట్ పనిచేశారు. ఆమె తండ్రి భీమ్ ఉదాస్. ఆయన మయన్మార్‌లో నేపాలీ రాయబారిగా పనిచేశారు. అంతకుముందు, ఆగస్టు 2018లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కైలాష్ మానసరోవర్‌కు వెళ్లే మార్గంలో రాహుల్ గాంధీ ఖాట్మండును సందర్శించారు.
నేపాల్ లో నైట్ క్లబ్ లో నేపాల్ లో చైనా రాయబారితో రాహుల్ గాంధీ ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. రాహుల్ వ్యక్తిగత జీవితం గురించి తమకు అవసరం లేదని కూడా బీజేపీ నేతలు చెబుతున్నారు.ఈ వీడియోకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేవకర్ Liquor బాటిల్ తో ఉన్న పోటోను షేర్ చేశాడు.