Coronavirus: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో కరోనా కలకలం.. 42 మందికి కొవిడ్ పాజిటివ్

By Mahesh KFirst Published Jan 12, 2022, 4:56 AM IST
Highlights

బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో 42 మందికి కరోనా సోకింది. ఇందులో బీజేపీ స్టాఫ్ మెంబర్స్‌తో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీ నేతలు తరుచూ సమావేశం అయ్యారు. ఇదే సమయంలో పలువురిలో కరోనా కేసులు ఉన్నట్టు తేలింది. ఆ తర్వాత అక్కడ చాలా మంది కరోనా టెస్టులు చేశారు. ఇందులో మంగళశారం 42 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.
 

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు(Assembly Elections) సమీపించిన తరుణంలో బీజేపీ(BJP) ప్రధాన పార్టీ కార్యాలయం(Head Quarters)లో కరోనా కలకలం రేపుతున్నది. మంగళవారం ఒక్క రోజే బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో 42 మందికి కరోనా పాజిటివ్(Positive) అని తేలింది. ఇందులో పార్టీ సభ్యలతోపాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంత పార్టీ నేతల మధ్య అనేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సమయంలో కరోనా కేసులు డిటెక్ట్ అయ్యాయి. దీంతో చాలా మందికి కరోనా టెస్టులు చేయడం మొదలు పెట్టారు. ఇందులో తాజాగా, 42 మంది పార్టీ స్టాఫ్ సభ్యులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించగానే టెస్టు చేయించుకున్నారని ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వివరించారు. ఆ కరోనా టెస్టు రిపోర్టు పాజిటివ్‌(Positive)గా వచ్చినట్టు తెలిపారు. ఇప్పుడు తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని వివరించారు. టెస్టు రిపోర్టు పాజిటివ్ రాగానే ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు. తనతో కాంటాక్టులోకి వచ్చిన వారు వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లాలని, కరోనా టెస్టు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయనకు తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో మూడు రోజులు పర్యటించాన‌ని తెలిపారు. ఆ సమయంలో తనకు Covid-19 సోకి ఉండొచ్చని వ‌రుణ్ గాంధీ వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పేర్కొన్నారు. Covid-19 ప‌రీక్ష‌లు సైతం చేయించుకోవాల‌ని తెలిపారు.

 కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari) కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్(Coronavirus Positive) అని తేలడంతో ఐసొలేషన్‌(Isolation)లోకి వెళ్లారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మంగళవారం వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్టు వివరించారు. ‘స్వల్ప లక్షణాలతో తనకు కరోనా పాజిటివ్ అని ఈ రోజు నిర్ధారణ అయింది. ప్రోటోకాల్స్ అనుసరించి నన్ను నేను ఐసొలేట్ చేసుకున్నాను. హోం క్వారంటైన్‌లో ఉన్నాను. నాతో కాంటాక్టులోకి వచ్చిన వారందరూ ఐసొలేషన్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత కరోనా టెస్టు చేసుకోండి’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఈ రెండు రోజుల్లో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. సోమవారమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై కరోనా మహమ్మారి బారిన పడ్డ సంగతి తెలిసిందే. తర్వాతి రోజే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కరోనా బారిన పడ్డారు. 

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Health Ministry) బులిటెన్ విడుదల చేసింది. 

click me!