ఆర్టీఐ దరఖాస్తుకు 40 వేల పేజీల సమాధానం.. డాక్యుమెంట్లతో నిండిపోయిన SUV, సర్కారుకు రూ. 80 వేల నష్టం

Published : Jul 29, 2023, 06:24 PM IST
ఆర్టీఐ దరఖాస్తుకు 40 వేల పేజీల సమాధానం.. డాక్యుమెంట్లతో నిండిపోయిన SUV, సర్కారుకు రూ. 80 వేల నష్టం

సారాంశం

ఓ వ్యక్తి ఆర్టీఐ కింద సీఎంహెచ్‌వోకు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆయనకు 40 వేల పేజీల సమాధానం వచ్చింది. వాటిని ఇంటికి తీసుకురావడానికి ఓ ఎస్‌యూవీనే తీసుకెళ్లారు. ఒక్క డ్రైవర్ సీటు మినహా ఎస్‌యూవీ మొత్తం ఆ డాక్యుమెంట్లతో నిండిపోయిందని దరఖాస్తుదారుడు పేర్కొన్నారు. ఉచితంగా సమాధానం ఇవ్వడంతో ప్రభుత్వానికి రూ. 80 వేల నష్టం వాటిల్లింది.  

భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కోవిడ్ కాలానికి సంబంధించిన వివరాల కోసం ఓ ఆర్టీఐ దరఖాస్తు చేశాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం నుంచి ఏకంగా 40 వేల పేజీల సమాధానం వచ్చింది. ఆ సమాధాన పత్రాలను తీసుకెళ్లడానికి ఆయన ఓ ఎస్‌యూవీని తెచ్చుకున్నాడు. ఆ డాక్యుమెంట్లతో ఎస్‌యూవీ మొత్తం నిండిపోయింది. ఒక్క డ్రైవర్ సీటు మాత్రమే మిగిలింది. ఈ పరిణామంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల నష్టం వచ్చింది. 

సాధారణంగా ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చే సమాధానాల పత్రాలకు ఒక్కదానికి రూ. 2 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర శుక్లా మాత్రం ఆ రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే.. ఆ సమాధానం ఇవ్వడానికి నెల రోజుల గడువు దాటిపోయింది.

కొవిడ్ మహమ్మారి కాలంలో మెడిసిన్స్, ఎక్విప్‌మెంట్ల కొనుగోలు, టెండర్లు, వాటికి బిల్లు పేమెంట్లకు సంబంధించిన వివరాలు అందించాలని ఆయన ఆర్టీఐ కింద చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేశారు. అయితే, ఆయనకు నెల రోజులలోపు సమాధానం ఇవ్వకపోవడంతో అప్పిలేట్ ఆఫీసర్ డాక్టర్ శరద్ గుప్తాను ఆశ్రయించినట్టు వివరించారు. నెల రోజుల్లోనే సమాధానం ఇవ్వలేకపోయినందున ఇప్పుడు ఉచితంగా ఆ సమాధానం శుక్లాకు ఇ్వవాలని ఆదేశించారు.

Also Read: రాహుల్‌కు పెళ్లి చేసేద్దాం.. సోనియా గాంధీ చెవిలో వేసిన మహిళ.. సోనియా, రాహుల్ ఏమన్నారంటే?

ఆ డాక్యుమెంట్లను తెచ్చుకోవడానికి ఎస్‌యూవీని తీసుకెళ్లినట్టు శుక్లా వివరించారు. ఒక్క డ్రైవర్ సీటు మినహాయిస్తే.. ఆ ఎస్‌యూవీ మొత్తం డాక్యుమెంట్లతో నిండిపోయిందని చెప్పారు.

ఆ సమాధానం ఉచితంగా ఇవ్వాలని తానే ఆదేశించినట్టు డాక్టర్ శరద్ గుప్తా తెలిపారు. సమయానికి సమాధానం ఇవ్వక రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల నష్టం తలపెట్టిన ఆఫీసర్ పై యాక్షన్ తీసుకోవాలని సీఎంహెచ్‌వోను ఆదేశించినట్టు వివరించారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు