తల్లి శవంపై కూర్చొని పూజలు.. భయంతో వణికిన స్థానికులు

By ramya neerukondaFirst Published Oct 3, 2018, 2:11 PM IST
Highlights

 అక్కడ మణికంఠన్‌  తన తల్లి శవంపై కూర్చున్నాడు. అతడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. చిత్రవిచిత్రమైన పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. 

తమిళనాడు రాష్ట్రం చెన్నైలో అఘోరాలు కలకలం సృష్టించారు. వారు చేసిన పని ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ వాళ్లు ఏం చేశారంటూ.. చెన్నైలో మంగళవారం ఓ మహిళ చనిపోయింది. విషయం తెలిసి ఆమె కుమారుడైన మణికంఠన్‌ (అఘోరా) 20 మంది అఘోరాలతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. 

భౌతికకాయానికి ప్రత్యేక పూజలు చేస్తూ.. ఊరేగింపుగా శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అక్కడ మణికంఠన్‌  తన తల్లి శవంపై కూర్చున్నాడు. అతడు పెద్ద పెద్ద కేకలు వేస్తూ.. చిత్రవిచిత్రమైన పూజలు చేస్తుంటే.. అతడి అనుచరులు ఢమరుకం వాయిస్తూ, శంఖం ఊదుతూ పెద్ద పెట్టున శబ్దాలు చేశారు. ఆతర్వాత తల్లి భౌతికకాయానికి దీపారాధనలు చేసి ఖననం చేశారు.
 
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో సోమవారం జరిగిన ఈ తతంగాన్ని చూసిన స్థానికులు భయంతో వణికిపోయారు. అరియమంగళం నదీతీరంలో ఉన్న కాళీమాత ఆలయాన్ని జయ్‌ అనే అఘోరా నిర్మించాడు. మణికంఠన్‌ తల్లి మేరి కూడా ఈ ఆలయంలో పనిచేసింది. ప్రస్తుతం ఈ ఆలయానికి మణికంఠనే వారసుడిగా ఉన్నాడు. అక్కడే తల్లి శవాన్ని ఖననం చేశాడు. చనిపోయిన వారి శవం మీద కూర్చొని పూజలు చేస్తే వారి ఆత్మ కాళీమాతలో ఐక్యమవుతుందని మణికంఠన్‌ చెబుతున్నాడు.

click me!