జమ్మూలో కలకలం: సాంబా సెక్టార్‌లో నాలుగు డ్రోన్ల కదలికలు

By narsimha lodeFirst Published Jul 16, 2021, 5:01 PM IST
Highlights


జమ్మూ కాశ్మీర్ లో నాలుగు డ్రోన్లు కలకలం సృష్టించాయి. సాంబా సెక్టార్ లో డ్రోన్లు కన్పించాయి.  కొంత కాలంగా జమ్మూలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
 

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ లోని సాంబా సెక్టార్ లో  డ్రోన్లు కలకలం  సృష్టించాయి. గత కొన్ని రోజులుగా డ్రోన్లు జమ్మూలో భద్రతవర్గాలకు సవాల్ విసురుతున్నాయి.జమ్మూలో బుధవారం నాడు రాత్రి ఒక డ్రోన్ కన్పించింది. అదే సమయంలో సాంబా సెక్టార్ లో నాలుగు అనుమానాస్పద డ్రోన్లు కన్పించాయి. మంగళవారం నాడు రాత్రి జమ్మూ వైమానిక స్థావరం చుట్టూ పనిచేస్తున్న డ్రోన్ ను నేషనల్ సెక్యూరిటీ గార్డులు యాంటీ డ్రోన్ వ్యవస్థ  రాడార్ల సహాయంతో సీజ్ చేశారు.

ఈ నెల 13వ తేదీ రాత్రి ఎయిర్ బేస్ నుండి 3 కి.మీ దూరంలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో డ్రోన్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వెంటనే డ్రోన్ అదృశ్యమైంది.గత నెలలో జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత  ఎన్‌ఎస్‌జీ యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించింది.కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్ లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. సరిహద్దు వద్ద ఉన్న ఆర్మీ, బోర్డర్ సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్లను గుర్తించి కాల్పులకు దిగిన విషయం తెలిసిందే.

click me!