ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఐసీఎంఆర్ హెచ్చరిక..!

By telugu news teamFirst Published Jul 16, 2021, 2:55 PM IST
Highlights

ఈ క్రమంలో వైరస్ వ్యాపించి.. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది ఐసీఎంఆర్. అయితే ఇది సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంటోంది. థర్డ్ వేవ్ వ్యాప్తికి సంబంధించి నాలుగు కారణాలను వివరించారు సమీరన్.
 

కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎంతలా నష్టం కలిగించాయో కూడా మనం చూశాం.  ఈ క్రమంలో థర్డ్ వేవ్ భయం అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలోనే.. థర్డ్ వేవ్ పై తాజాగా  ఐసీఎంఆర్ హెచ్చరికలు జారీ చేసింది.

తాజాగా ఐసీఎంఆర్ ఎపిడెమియాజీ, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం డైరెక్టర్ సమీరన్ పాండా ఆగస్ట్ లో థర్డ్ వేవ్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజలు యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వైరస్ వ్యాపించి.. ఆగస్టులో థర్డ్ వేవ్ వస్తుందని అంచనా వేసింది ఐసీఎంఆర్. అయితే ఇది సెకెండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అంటోంది. థర్డ్ వేవ్ వ్యాప్తికి సంబంధించి నాలుగు కారణాలను వివరించారు సమీరన్.


 ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలో ప్రజలు పొందిన ఇమ్యూనిటీ తగ్గిపోవడం… ఇమ్యూనిటీ పవర్ ఉన్నా వ్యాపించగల కొత్త వేరియంట్ రావడం… వైరస్ వేగంగా వ్యాపించేలా మారిపోవడం… రాష్ట్రాల్లో ముందుగానే ఆంక్షలు ఎత్తేయడం వల్ల థర్డ్ వేవ్ కు దారితీయొచ్చని అన్నారు సమీరన్. దేశంలో థర్డ్ వేవ్ రావడం తప్పదంటూ ఇటీవల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేసిన ప్రకటనపైనా స్పందించిన ఆయన… ఇప్పటికే ప్రభుత్వాలు, ప్రజలు రూల్స్ పట్టించుకోవడం లేదని దానివల్ల థర్డ్ వేవ్ ముప్పు ఆగస్ట్ లోనే ఉంటుందని అంచనా వేశారు.

click me!