రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

Published : Aug 17, 2021, 11:20 AM IST
రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

సారాంశం

రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు కారును ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో   జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.రాష్ట్రంలోని హనుమాన్‌ఘడ్ జిల్లాలో రాష్ట్ర రోడ్డు రవాణా బస్సు కారును ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదం సోమవారం నాడు రాత్రి చోటు చేసుకొంది. హర్యానాలోని అడంపూర్ మండి వాసులు. పిలిబంగా నుండి హిసార్ కు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. బస్సు కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు బంద్రా నుండి వస్తున్న సమయంలో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు.

 
 

PREV
click me!

Recommended Stories

Indian Army: ఇండియ‌న్ ఆర్మీ కీల‌క నిర్ణ‌యం.. ఇక ఆర్మీలో కూడా ఏఐ టెక్నాల‌జీ వినియోగం
Indian Air Force : చైనా, పాక్‌లకు చెక్.. భారత్ అమ్ములపొదిలొ శక్తివంతమైన అస్త్రం..!