కాంచీపురంలో తొక్కిసలాట: గుంటూరు మహిళ సహా నలుగురు మృతి

Published : Jul 18, 2019, 06:02 PM IST
కాంచీపురంలో తొక్కిసలాట: గుంటూరు మహిళ సహా నలుగురు మృతి

సారాంశం

కాంచీపురం అత్తి వరద రాజస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో గుంటూరు ఏపీ రాష్ట్రానికిచెందిన మహిళ కూడ ఉన్నారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం అత్తివరదరాజస్వామి ఉత్సవాల్లో గురువారం నాడు అపశృతి చోటు చేసుకొంది.  ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి

అత్తి వరద రాజస్వామి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. అయితే  ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలుగురు మృతి చెందారు.  మృతుల్లో గుంటూరు జిల్లాకు చెందిన మహిళ ఒకరు ఉన్నారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.


 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?