కర్ణాటక సంక్షోభం: ఇవాళే బలపరీక్ష పెట్టండి.. స్పీకర్‌కు గవర్నర్ లేఖ

Siva Kodati |  
Published : Jul 18, 2019, 05:36 PM IST
కర్ణాటక సంక్షోభం: ఇవాళే బలపరీక్ష పెట్టండి.. స్పీకర్‌కు గవర్నర్ లేఖ

సారాంశం

స్పీకర్ సురేశ్ కుమార్ విశ్వాస పరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసిన వెంటనే.. ఆయన స్పందించారు. ఇవాళే బలపరీక్షను నిర్వహించాల్సిందిగా గవర్నర్ వాజుభాయ్ వాలా.. స్పీకర్‌కు లేఖ రాశారు.

కర్ణాటక సంక్షోభం ఎపిసోడ్‌లో గవర్నర్ ఇన్‌వాల్వ్ అయ్యారు. బలపరీక్షను ఇవాళే నిర్వహించాలంటూ గవర్నర్ వాజుభాయ్ వాలా స్పీకర్‌ సురేశ్‌ కుమార్‌కు లేఖ రాశారు. గురువారం సాయంత్రం గవర్నర్ కార్యాలయ అధికారులు.. స్పీకర్‌ను కలిసి వాజుభాయ్ వాలా పంపిన లేఖను అందజేశారు.

దీనిని స్పీకర్ సభలో చదివి వినిపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్‌ను గవర్నర్ ఆదేశించలేరంటూ మండిపడ్డారు. అయితే బలపరీక్షను స్పీకర్ కావాలనే జాప్యం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

కాగా అంతకు ముందు స్పీకర్ సురేశ్ కుమార్ విశ్వాస పరీక్షను కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవాళే విశ్వాసపరీక్ష పెట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే గవర్నర్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

PREV
click me!

Recommended Stories

DAIS : ఐశ్వర్యారాయ్ కూతురు చదివే ధీరూభాయ్ అంబానీ స్కూల్ ఫీజు ఎంత?
ఆకాష్, అనంత్ అంబానీలు తెలుసు... మరి ఎవరీ జై అన్మోల్ అంబానీ?