ముంబయిలో కూలిన భవనం.. నలుగురి మృతి

Published : Jul 17, 2020, 08:09 AM IST
ముంబయిలో కూలిన భవనం.. నలుగురి మృతి

సారాంశం

శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు

ముంబయిలో ఘెర ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ముంబయిలోని మింట్ రోడ్డులో ఓ ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. కాగా.. భవనంలో కొంత భాగం కుప్పకూలగా.. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన సహాయక చర్యల్లో 23మంది ప్రాణాలతో బయటపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

గురువారం సాయంత్రం 4:45గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దక్షిణ ముంబయిలోని మింట్​ రోడ్డులోని భానుషాలి భవనంలోని 30-40శాతం భాగం కుప్పకూలింది. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. వర్షాకాలంలో.. ముంబయి నగరంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటూనే ఉండటం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు