కరోనా చికిత్సకు వచ్చిన బాలికపై అఘాయిత్యం

Published : Jul 17, 2020, 07:49 AM IST
కరోనా చికిత్సకు వచ్చిన బాలికపై అఘాయిత్యం

సారాంశం

రాత్రివేళ ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా అక్కడ గార్డు మహేష్ ప్రసాద్ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు.   

కరోనా వైరస్ సోకి బాధపడుతున్న బాలిక చికిత్స కోసం రాగా.. ఆ చిన్నారిపై ఓ గార్డు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  ఈ దారుణ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బీహార్ రాష్ట్రంలోని పట్నా నగరంలోని వైద్యకళాశాల కొవిడ్-19 క్వారంటైన్ కేంద్రంలో దారుణం వెలుగుచూసింది. పట్నా మెడికల్ కళాశాల కొవిడ్ ఆసుపత్రిలో మహేష్ ప్రసాద్ గత మూడు నెలలుగా గార్డుగా పనిచేస్తున్నాడు.

రాత్రివేళ ఓ బాలిక చికిత్స చేయించుకునేందుకు ఆసుపత్రికి రాగా అక్కడ గార్డు మహేష్ ప్రసాద్ ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

బాలికకు వైద్యపరీక్షలు చేయించామని, రెండు,మూడు రోజుల్లో వైద్యుల నివేదిక వస్తుందని బీహార్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ దిల్మనీ మిశ్రా చెప్పారు. నిందితుడైన గార్డును అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu