కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం : ఆర్మీ వాహనంలో మంటలు.. నలుగురు జవాన్లు సజీవదహనం

Siva Kodati |  
Published : Apr 20, 2023, 04:09 PM IST
కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం : ఆర్మీ వాహనంలో మంటలు.. నలుగురు జవాన్లు సజీవదహనం

సారాంశం

పూంచ్ - జమ్మూ హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. 

పూంచ్ - జమ్మూ హైవేపై ఆర్మీ వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. జవాన్లతో వెళ్తున్న వాహనం పూంచ్ జిల్లా తోటగలి గ్రామ సమీపంలో రాగానే ఒక్కసారిగా అందులో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే వాహనం మొత్తం మంటలు వ్యాపించగా, తప్పించుకునే వీలులేకపోవడంతో నలుగురు జవాన్లు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీస్, ఆర్మీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM