
మధ్యప్రదేశ్ : ఐదేళ్ల బాలుడు అత్యంత దారుణంగా హత్య చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భింద్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిపే ఘటన ఇది. ఐదేళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని కూలర్ లో ఉంచారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. మధ్యాహ్నం ట్యూషన్ కని వెళ్లిన బాలుడు.. అక్కడికి చేరుకోనేలేదు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చే టైం అయిపోతున్నా బాలుడు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు కొడుకు కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. చివరకు ఆ ప్రాంతంలోని కూలర్ లో ఆ చిన్నారి మృతదేహం లభ్యమయ్యింది. దీనిమీద మాచంద్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి వివేక్ ప్రభాత్ ఈ మేరకు వివరాలు తెలిపారు. దాని ప్రకారం ఐదేళ్ల బాలుడు బుధవారం మధ్యాహ్నం 3.30గంటలకు ట్యూషన్ కు వెళ్లాడు. అయితే, ట్యూషన్ వరకు వెళ్లలేదు. ట్యూషన్ నుంచి తిరిగి రావాల్సిన సమయానికి రాలేదు. దీంతో బాలుడు గురించి వెతికి.. బంధువులు పోలీసులను ఆశ్రయించారు.
శరద్ పవార్‌ను కలిసిన గౌతమ్ అదానీ.. రెండు గంటల పాటు సాగిన సమావేశం..!
పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారితో పాటు ట్యూషన్ కు వెళ్లే మిగతా పిల్లలను ఆరా తీశారు. వాళ్లు వెంటనే సంతోష్ చౌరాసియా ఇంటికి చిన్నారి వెళ్లినట్లు తెలిసింది. ఆ తరువాత చిన్నారి కనిపించలేదు.. ట్యూషన్ కు రాలేదు. దీంతో పోలీసులు.. సంతోష్ చౌరాసియా ఇంట్లో సోదాలు చేపట్టారు. అక్కడ కనిపించిన దృశ్యం పోలీసులు అవాక్కయ్యారు. అక్కడ కూలర్ లో బాలుడి మృతదేహం లభించింది. దీంతో పోలీసులు కాలనీలోని ఇతరులను.. బాలుడి కుటుంబాన్ని విచారిస్తున్నారు. ఈ దారుణమైన ఘటన వెనుక అసలు కారణం ఏంటి? కుటుంబసభ్యులే దారుణానికి పాల్పడ్డారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.