Earthquake: ఉలిక్కిపడ్డ అండమాన్ నికోబార్..  అర్థరాత్రి భూకంపం.. భయాందోళనతో జనం పరుగులు.. 

By Rajesh KarampooriFirst Published Apr 1, 2023, 6:24 AM IST
Highlights

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో భూకంపం సంభవించింది.దీంతో ఒక్కసారిగా అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రజలు భయాభంత్రులతో రోడ్లపై పరుగులు దీశారు. 

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం, రాత్రి 11:56 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించలేదు. అంతకుముందు మార్చి 24న  నికోబార్‌లో భూకంపం సంభవించింది.

ఈ మేరకు NCS ట్వీట్ చేస్తూ.. "మార్చి 31, 2023న 23:56 సమయంలో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది భూమిలో 28 కిలోమీటర్ల లోతులో భూ కంపం సంభవించింది. ఇది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో పోర్ట్‌బ్లేర్ 140 కిలోమీటర్ల దూరంలో వచ్చింది" అని NCS ట్వీట్ చేసింది.

ఈ భూకంపం తీవ్రత 4 కాబట్టి.. ప్రజలు  ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ఇళ్లకు చిన్న, చిన్న బీటలు వారే అవకాశం మాత్రమే ఉంటుంది. అలాగే.. భూకంపం 28కిలోమీటర్ల లోతులో సంభవించింది కావున అంత పెద్ద ప్రభావం కనిపించదు. అయితే.. మార్చి 24న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ దగ్గర 3.9 తీవ్రతతో ఓ భూకంపం సంభవించింది. దానికీ దీనికీ ఏదైనా సంబంధం ఉందా అన్నది NCS పరిశీలిస్తోంది.  

భూకంపాలు ఎలా వస్తాయి?

భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం భూమి లోపల ప్లేట్లు ఢీకొనడమే. భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఏదో ఒక సమయంలో ఢీకొన్నప్పుడు, అక్కడ ఒక ఫాల్ట్ లైన్ జోన్ ఏర్పడుతుంది . ఉపరితలం యొక్క మూలలు ముడుచుకుంటాయి. ఉపరితలం యొక్క మూలల కారణంగా అక్కడ ఒత్తిడి పెరుగుతుంది . ప్లేట్లు విరిగిపోతాయి. ఈ పలకల విచ్ఛిన్నం కారణంగా, లోపల ఉన్న శక్తి బయటకు రావడానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది. దాని కారణంగా భూమి కంపిస్తుంది. దానిని భూకంపంగా పరిగణిస్తాము.

భూకంప తీవ్రత

రిక్టర్ స్కేలుపై 2.0 కంటే తక్కువ తీవ్రతతో సంభవించే భూకంపాలు సూక్ష్మంగా వర్గీకరించబడ్డాయి, వీటిని అనుభూతి చెందలేం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ రిక్టర్ స్కేల్‌పై సూక్ష్మ వర్గానికి చెందిన 8,000 భూకంపాలు నమోదవుతున్నాయి. అదేవిధంగా 2.0 నుంచి 2.9 తీవ్రతతో సంభవించే భూకంపాలను మైనర్ కేటగిరీకి చెందినవి. ప్రతిరోజూ 1,000 భూకంపాలు సంభవిస్తాయి, మనం దానిని సాధారణంగా అనుభవించలేము. 3.0 నుండి 3.9 తీవ్రతతో చాలా తేలికపాటి భూకంపాలు సంవత్సరంలో 49,000 సార్లు నమోదు చేయబడ్డాయి. అవి అనుభూతి చెందుతాము. కానీ,  ఎటువంటి హాని కలిగించవు. లైట్ కేటగిరీ భూకంపాలు 4.0 నుండి 4.9 తీవ్రతతో సంభవిస్తాయి. ఇవి రిక్టర్ స్కేల్‌పై ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 6,200 సార్లు నమోదు చేయబడ్డాయి. ఈ ప్రకంపనలు అనుభూతి చెందుతాం,  ఈ భూకంపం కారణంగా గృహోపకరణాలు కదులుతున్నాయి. అయినప్పటికీ, అవి చాలా తక్కువ నష్టాన్ని కలిగిస్తాయి.

click me!