బిహార్ లో దారుణం... 36మంది చిన్నారులు మృతి

By telugu teamFirst Published Jun 12, 2019, 9:51 AM IST
Highlights

బిహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. కేవలం 48గంటల్లో 36మంది చిన్నారులు కన్నుమూశారు. మెదడువాపు వ్యాధి లక్షణాలతో వారంతా చనిపోవడం గమనార్హం. 


బిహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ లో దారుణం చోటుచేసుకుంది. కేవలం 48గంటల్లో 36మంది చిన్నారులు కన్నుమూశారు. మెదడువాపు వ్యాధి లక్షణాలతో వారంతా చనిపోవడం గమనార్హం.  కాగా... మరో 133మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

 ఈ చిన్నారుల్లో ఎక్కువశాతం మంది రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోయి చినిపోయినట్లు వైద్యులు తెలిపారు. కాగా... ఇలా రెండు రోజుల్లో ఇంత మంది చిన్నారలు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం రేపింది.

జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులన్నీ మెదడువాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోయాయి. అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటికి ఈ వ్యాధి లక్షణాలు. ఇందులో చాలా మంది పిల్లలు మారుమూల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ జిల్లాలో వేసవి కాలం వస్తే మెదడువాపు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.  ఈ ఘటనపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోవడం గమనార్హం.

click me!