గడ్చిరోలి దాడి సూత్రధారిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

Siva Kodati |  
Published : Jun 11, 2019, 08:10 PM IST
గడ్చిరోలి దాడి సూత్రధారిని అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

సారాంశం

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో ఐఈడీ పేల్చి 16 మంది పోలీసుల మృతికి కారణమైన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అడవుల్లో ఐఈడీ పేల్చి 16 మంది పోలీసుల మృతికి కారణమైన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కిరణ్ అతని భార్య గా తెలిపారు.

కిరణ్ ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నాడు. కిరణ్ అతని భార్య విజయవాడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

గత నెలలో గడ్చిరోలి అడవుల్లో పెట్రోలింగ్‌కు వెళుతున్న క్విక్ రెస్పాన్స్ బృందం వాహనాన్ని టార్గెట్ చేసిన మావోయిస్టులు... కుర్‌కెదాలోని లెంధరీ నల్లా దగ్గర శక్తివంతమైన ఐఈడీతో పేల్చివేశారు. ఈ ఘటనలో 16 మంది పోలీసులు అక్కడికక్కడే అమరులయ్యారు. పేలుడు తీవ్రతకు వాహణం తునాతునకలైంది. 

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !