కరోనా సోకిన ఓ జర్నలిస్టు సోమవారం నాడు ఎయిమ్స్ నాలుగో అంతస్థు నుండి కిందకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
న్యూఢిల్లీ:కరోనా సోకిన ఓ జర్నలిస్టు సోమవారం నాడు ఎయిమ్స్ నాలుగో అంతస్థు నుండి కిందకి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. న్యూఢిల్లీలోని ఓ ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలతో ఆయన ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇవాళ మధ్యాహ్నం ఎయిమ్స్ ఆసుపత్రి నాలుగో అంతస్తు నుండి ఆయన దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కింద పడిన ఆయనను ఆసుపత్రి సిబ్బంది గుర్తించి వెంటనే ఎమర్జెన్సీవార్డుకు తరలించారు.
కరోనాతో ఆయన ఉద్యోగం కోల్పోయినట్టుగా ఆయన బంధువులు చెబుతున్నారు. దీంతో మనోవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా అనుమానిస్తున్నారు.
also read:తిరుపతిలో దారుణం: కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం జేసీబీతో పూడ్చివేత
ఢిల్లీ రాష్ట్రంలో ఇప్పటివరకు 99,444 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 71,339 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో రాష్ట్రంలో 3.067 మంది మరణించారు.
దేశంలో సోమవారంనాటికి కరోనా కేసులు 6,99,402 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో అతి పెద్ద ఆసుపత్రిని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఆసుపత్రిని కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు ఆదివారం నాడు పరిశీలించారు.