ఇండియాలో 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

Published : Apr 16, 2020, 04:39 PM IST
ఇండియాలో 325 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు: కేంద్ర ఆరోగ్య శాఖ

సారాంశం

దేశంలోని 325 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.  

న్యూఢిల్లీ: దేశంలోని 325 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు.

గురువారం నాడు సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 941  కరోనా కేసులు నమోదైనట్టుగా ఆయన చెప్పారు.ఈ కొత్త కేసులతో కలుపుకొని మొత్తం కేసుల సంఖ్య 12,380కి చేరుకొన్నట్టుగా అగర్వాల్ తెలిపారు.ఈ వైరస్ సోకి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 414 మంది మృతి చెందారు.

కంటైన్మెంట్ జోన్లలో నాణ్యమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.కంటైన్మెంట్ జోన్లతో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని  రాష్ట్రాలను ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు.
also read:కరోనా దెబ్బ: మద్యం లేక మిథనాల్ తాగి ముగ్గురి మృతి

కరోనా కోసం అవసరమైన వైద్య పరికరాలను మేకిన్ ఇండియా ద్వారా తయారు చేయడంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు. మే మూడో తేదీ వరకు విమానాలు, రోడ్డు మార్గంలో నడిచే ప్రజా రవాణా వ్యవస్థ నిలిపివేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాలకే కేంద్రం లేఖ రాసిందన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్