మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వ్యక్తి అరెస్ట్...!

Published : Oct 07, 2022, 09:45 AM IST
 మహిళకు ప్రైవేట్ పార్ట్స్ చూపించిన వ్యక్తి అరెస్ట్...!

సారాంశం

అతను చేసిన పనికి యువతి భయపడిపోయి... గట్టిగా కేకలు పెట్టింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల ఉన్నవారంతా వెంటనే ఆమె వద్దకుచేరారు. వారందరినీ చూసి... నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

రోడ్డు మీద తన కుక్కతో కలిసి వాకింగ్ చేస్తున్న  యువతి పట్ల.. ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. యువతికి తన ప్యాంట్ జిప్ తీసి.. ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు. కాగా.. తాజాగా.. ఈ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాలుగు నెలల క్రితం దక్షిణ ముంబయి లోని గామ్ దేవి  కెన్నెడీ బ్రిడ్జి సమీపంలో నిందితుడు రామ్‌లాఖాన్ హరిజన్ ఓ యువతినికి తన చేతితో అసభ్యంగా సైగలు చేశాడు. అయితే... అతని సైగలను ఆమె ఏ మాత్రం పట్టించుకోకుండా వెళ్తుంటే.. ఆమె ముఖం మీద ఫ్లాష్ పడేలా చేసి..  తన ప్యాంట్ జిప్ తీసి ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు. 

అతను చేసిన పనికి యువతి భయపడిపోయి... గట్టిగా కేకలు పెట్టింది. ఆమె అరుపులకు చుట్టుపక్కల ఉన్నవారంతా వెంటనే ఆమె వద్దకుచేరారు. వారందరినీ చూసి... నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

అయినా... యువతి ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దాదాపు 100 రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

"అతను తన గ్రామానికి పారిపోయాడు. ఆ  తరువాత గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. ఆ తర్వాత, అతను ముంబైకి వచ్చాడు. అతను నగరానికి తిరిగి వచ్చినట్లు మా బృందానికి సమాచారం అందింది. పబ్లిక్, ప్రైవేట్ కెమెరాల నుండి దాదాపు 150 వీడియోలను స్కాన్ చేశారు.  నిందితుడు ఎక్కువగా పెయింటింగ్ ఉద్యోగాలు చేస్తాడు. అనేక CCTV టేపులను స్కాన్ చేసిన తర్వాత  ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు స్లమ్ ప్రాంతాలలో వాంటెడ్ నిందితుల పోస్టర్లను ఉంచిన తర్వాత.. అతను ఎక్కడ ఉన్నాడనే సమాచారం అందింది. నిందితుడు డిబి మార్గ్, విపి రోడ్ ప్రాంతంలో కనిపించాడు. వెంటనే అతనిని పోలీసులు అరెస్టు చేశారు.’’ అని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ కి పంపారు. ఒక యువతికి అసభ్యకరంగా సైగలు చేసి.. దురుద్దేశంతో ఆమెను ఇబ్బంది పెట్టిన కారణంతో అతనిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. 


 

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu