ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్: ఒకే కుటుంబంలో 32 మందికి పాజిటివ్

By Siva KodatiFirst Published Sep 1, 2020, 5:24 PM IST
Highlights

భారత దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఒకే కుటుంబంలోని 32 మందికి పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది

భారత దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. తాజాగా ఒకే కుటుంబంలోని 32 మందికి పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని బండా ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన వీరికి నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.

వీరితో పాటు, మరో 44 మందితో కలిపి సోమవారం సాయంత్రానికి జిల్లాలో వైరస్ బారినపడిన వారి సంఖ్య 807కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కోవిడ్ కారణంగా నీలన్ష్ శుక్లా అనే యువ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయారు.

ఎలాంటి లక్షణాలు లేకుండానే తనకు పాజిటివ్ వచ్చిందని, గత కొద్దిరోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారు అప్రమత్తంగా ఉండాలని శుక్లా ఆగస్టు 20న ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఇంతలోనే ఆరోగ్యం విషమించడంతో ఆయన మృతి చెందడం విషాదం నింపింది.

కాగా దేశంలో ఇప్పటి వరకు 36 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, 65 వేల మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,30,414 మందికి పాజిటివ్‌గా తేలగా.. 3,486 మంది మృతి చెందారు. 

click me!