కేంద్ర ఎన్నికల కమీషనర్‌గా రాజీవ్ కుమార్: అశోక్ లవాసా స్థానంలో నియామకం

By Siva KodatiFirst Published Sep 1, 2020, 4:45 PM IST
Highlights

కేంద్ర నూతన ఎన్నికల కమీషనర్‌గా మాజీ ఆర్ధిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు

కేంద్ర నూతన ఎన్నికల కమీషనర్‌గా మాజీ ఆర్ధిక శాఖ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఉపాధ్యక్ష పదవికి ఆగస్టులో రాజీనామా చేసిన ఆయనను అంతకుముందున్న ఎన్నికల కమీషనర్ అశోక్ లవాసా స్థానంలో నియమించారు.

ఈ సందర్భంగా ఆయనకు పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏప్రిల్ 29న ఆర్ధిక  శాఖ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన రాజీవ్ కుమార్‌ను పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పీఈఎస్‌బీ) ఆసియా అభివృద్ధి బ్యాంక్ చైర్మన్‌గా నియమించింది.

1984 జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన ఆయనకు పబ్లిక్ పాలసీ, అడ్మినిష్ట్రేషన్‌లో 30 ఏళ్లకు పైగా అనుభవం వుంది. ఇదే  సమయంలో ఆయన మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అండ్ సస్టెనబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్ఎల్‌బీ డిగ్రీల్లో రాజీవ్ కుమార్ పట్టభద్రులు.

click me!