
ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారి మీద ఒకటో తరగతి చదువుతున్న బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన లైంగిక దాడి ఘటన యూపీలోని ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. నిందితుడుగా చెబుతున్న బాలుడు ఆ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలిక ప్లే స్కూల్లో చదువుకుంటుంది. చిన్నారికి ఆ బాలుడు ఏవో మాయమాటలు చెప్పి మేడమీదికి తీసుకువెళ్లి ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అధికారులు చెబుతున్నారు.
బాలుడికి పదేళ్ల వయసు ఉంటుందని సమాచారం. బాలుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. శనివారం బాలికను పాఠశాల భవనం పైకప్పు మీదికి తీసుకెళ్లి బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలుడి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.