అనుమానంతో కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీసును కారుతో లాక్కెళ్లాడు. మొదట కారు ఆపకపోవడంతో బైక్‌పై కారును వెంబడించి వాషి నగరంలోని ఓ క్రాస్‌రోడ్‌లో మళ్లీ ఆపే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఈ ఘటన జరిగింది.
ముంబయి : మహారాష్ట్రలో ఢిల్లీ తరహా ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. ఓ కారు ఏకంగా ట్రాఫిక్ పోలీసునే 10కి.మీ. లు ఈడ్చుకెళ్లింది. అయితే, ట్రాఫిక్ పోలీస్ కారు కింద కాకుండా కారు బానెట్ మీద ఉండడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. డ్రగ్స్ మత్తులోనే ఈ దారుణ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. డ్రగ్స్ మత్తులో ఓ వ్యక్తి తన కారు అద్దాలపై ట్రాఫిక్ పోలీసును పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
ఏదో తప్పు జరిగిందన్న అనుమానంతో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగింది. డ్రైవర్ ఆపకపోవడంతో బైక్‌పై కారును వెంబడించి వాషి నగరంలోని ఓ క్రాస్‌రోడ్‌లో మళ్లీ ఆపే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ వ్యక్తి వేగాన్ని తగ్గించకుండా, కానిస్టేబుల్ సిద్ధేశ్వర్ మాలీని కారుతో పాటు తన వెంట తీసుకెళ్లాడు. ఘటనకు సంబంధించిన వీడియోలో అతను విండ్‌షీల్డ్‌పై పడుకున్నట్లు చూపించారు. నిందితుడు ఆదిత్య బెంబాడే దాదాపు పది కిలోమీటర్ల మేర ఇలా వాహనం నడిపాడు.
చివరగా, నగరంలోని ఉరాన్ నాకా వద్ద గవాన్ ఫాటా సమీపంలో పోలీసు వాహనంతో వెళ్తున్న కారును ఆపారు. ఆ వ్యక్తిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ మత్తులో మాలిని చంపడానికి ప్రయత్నించినందుకు అతనిపై కేసు నమోదు చేశారు.
వడగాలుల కారణంగా బెంగాల్‌లో 24వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలు బంద్
ఇదిలా ఉండగా, న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో కారు కింద చిక్కుకున్న అంజలీసింగ్ను 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి ఆమె మృతికి కారణమైన దారుణ ఘటనలో నలుగురు వ్యక్తులపై పోలీసులు హత్యానేరం మోపారు. అమిత్ ఖన్నా, కృష్ణ, మనోజ్ మిట్టల్, మిథున్ లు అంజలి సింగ్ (20)ని అత్యంత అనాగరికంగా హత్య చేశారని ఢిల్లీ పోలీసులు నిన్న కోర్టుకు తెలిపారు.
జనవరి 1వ తారీఖు తెల్లవారుజామున ఢిల్లీలోని కంఝవాలాలో రోడ్డుపై అంజలిని ఢీకొట్టిన తర్వాత.. ఆమెను రక్షించడానికి వారికి చాలా అవకాశాలు ఉన్నాయని పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జ్ షీట్‌లో తెలిపారు. మహిళ కారు ఇంజన్‌లో ఇరుక్కుపోయిందని నలుగురికి తెలిసినా ఉద్దేశపూర్వకంగానే ఆమెను.. అలాగే చాలా కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారని పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఛార్జ్ షీట్ ప్రకారం నేరం రెండు దశల్లో జరిగింది - స్కూటర్ నడుపుతున్న అంజలి సింగ్‌ను కారు ఢీకొట్టడం.. అంజలీసింగ్ కారు కింద ఇరుక్కున్నాక లాక్కుపోవడం.. ప్రమాదం జరిగిన ప్రదేశానికి 500-600 మీటర్ల దూరంలో పురుషులు కారును ఆపారు. మహిళ కారు కింద ఇరుక్కుపోయిందో లేదో తనిఖీ చేయడానికి డ్రైవర్ కారు నుండి కిందికి దిగాడు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు నిర్ధారించేందుకు సాక్షుల ఖాతాలు, సీసీటీవీ కెమెరా ఫుటేజీలు, ఇతర ఆధారాలను చార్జ్ షీట్ ఉదహరించింది. అమిత్ ఖన్నా డ్రైవింగ్ చేస్తుండగా, మనోజ్ మిట్టల్ ముందు సీట్లో కూర్చున్నాడు.
ఛార్జ్ షీట్‌లో ఆరుగురు సాక్షులను చేర్చారు. ప్రమాదం సమయంలో ఆమెతో ఉండి, ఆ తరువాత అక్కడినుంచి పారిపోయిన అంజలీసింగ్ స్నేహితురాలి అకౌంట్ ను చార్జిషీట్‌లో చేర్చారు. కారు కింద మృతదేహాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆటోరిక్షా డ్రైవర్ కూడా సాక్షిగా చేర్చారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రగిల్చింది. రోడ్ సేఫ్టీ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఈ ఘటన తరువాత నేరాన్ని కప్పిపుచ్చడానికి సహాయం చేసిన ముగ్గురు నిందితులతో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.