రైతుల దీక్షలో కూర్చున్న మహిళలపై దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురి మృతి..!

By telugu news teamFirst Published Oct 28, 2021, 9:34 AM IST
Highlights

సదరు మహిళలు డివైడర్ పై కూర్చొని ఉండటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. సదరు మహిళలు డివైడర్ ఫై కూర్చోని ఆటో కోసం ఎదురు చూస్తున్నారట. ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు.
 

వేగంగా వెళ్తున్న ఓ ట్రక్కు.. ముగ్గురు మహిళల మీదకు దూసుకువెళ్లింది. ఈ క్రమంలో... ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. సదరు మహిళలు రైతు దీక్షలో పాల్గొన్న సమయంలో ఇలా జరగడం దురదృష్టకరం. ఈ సంఘటన హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గత కొన్ని నెలలుగా ఢిల్లీ- హర్యానా సరిహద్దులో రైతులు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ రైతుల నిరసన వేదిక సమీపంలో వేగంగా వస్తున్న ఓ ట్రక్కు డివైడర్ ని ఢీ కొట్టి.. మహిళలపై దూసుకువచ్చింది. సదరు మహిళలు డివైడర్ పై కూర్చొని ఉండటంతో వారు ప్రాణాలు కోల్పోయారు. సదరు మహిళలు డివైడర్ ఫై కూర్చోని ఆటో కోసం ఎదురు చూస్తున్నారట. ట్రక్కు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు.

Also Read: బెంగళూరులో డెల్టా సబ్ వేరియంట్ కేసులు.. కొత్తరకం కరోనాపై రాష్ట్రంలో ఆందోళనలు

ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడం గమనార్హం. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ మహిళలు పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందినవారని ప్రాథమిక నివేదిక లో తేలింది. పొస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Aryan Khan Case : ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి అరెస్ట్...

ఇదిలా ఉండగా.. గత కొన్నినెలలుగా హర్యానా, ఢిల్లీలో సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేపడుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. వారు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చిన మహిళా రైతులే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.  

click me!