Illicit relationship: సంతోషంగా జీవనం సాగించే కుటుంబాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ఇదే నేపథ్యంలో పోలీసుల విచారణలో తాజాగా ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సొంత చెల్లిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడు ఒక అన్న. తనను చంపవద్దని వేడుకున్నా కనికరం చూపకుండా పదునైన ఆయుధంతో క్రూరంగా ప్రాణాలు తీశాడు. ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. తన సొంత చెల్లిని అన్ననే కిడ్నాప్ చేసి, హత్య చేసిన ఘటన బీహార్‌లోని నవాడా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ హత్యకు సంబంధించి మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసుల విచారణలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె హత్య చేసింది తన సొంత అన్నయ్యగా పోలీసులు గుర్తించారు. మహిళ మామ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపి కేసును చేధించారు. పోలీసుల విచారణలో చెల్లిని తానే హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు.
మొదట తన చెల్లిని నమ్మించి కిడ్నాప్ చేసిన నిందితుడు.. నిర్మానూష్య అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి క్రూరంగా హత్య చేశారు. అనంతరం శవాన్ని మాయం చేయడానికి ఒక గుంతతీసి పూడ్చిపెట్టాడు. తాను ఈ దారుణానికి ఒడికట్టడానికి కారణం అక్రమ సంబంధమేనని తెలిపారు. వివాహిత ఆ మహిళతమ పొరుగింటి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ, దీని గురించి అనేక సార్లు తాను హెచ్చరించానని నిందితుడు చెప్పాడు. అయినా వినకుండా తన అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. ఈ నేపథ్యంలోనే తన చెల్లిన హతమార్చాలని ప్లాన్ వేసి.. కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసినట్టు నిందితుడు తెలిపినట్టు పోలీసులు వెల్లడించారు.
మహిళ మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు, ఆమె పంచపాడినిక ఉపయోగించిన ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి, నిందితుడిని జైలుకు పంపినట్టు సీనియర్ పోలీసు అధికారి మహేష్ చౌదరి తెలిపారు. "ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సాంకేతిక విశ్లేషణ సహాయంతో, మహిళ సోదరుడిని అరెస్టు చేశారు. లీడ్‌లను అనుసరించి, అతన్ని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి, క్షుణ్ణంగా వెతకగా, మృతదేహాన్ని కనుగొన్నారు. విచారణలో, మహిళ సోదరుడు తన నేరాన్ని అంగీకరించాడు" అని మహేష్ చౌదరి వెల్లడించారు.