IND vs PAK: పాక్ విజ‌యంపై సంబురాలు.. యూపీలో ముగ్గురు కాశ్మీరీ విద్యార్థులు అరెస్ట్

Siva Kodati |  
Published : Oct 28, 2021, 10:18 AM IST
IND vs PAK: పాక్ విజ‌యంపై సంబురాలు.. యూపీలో ముగ్గురు కాశ్మీరీ విద్యార్థులు అరెస్ట్

సారాంశం

పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఉత్తరప్రదేశ్‌లోని (uttar pradesh) ఆగ్రాలోని (agra) రాజా బ‌ల్వంత్ సింగ్ కాలేజీలో (raja balwant singh college) కాశ్మీరీ విద్యార్థులు (kashmir students) సంబురాలు జ‌రుపుకున్న వ్యవహారం దుమారం రేపింది. విద్యార్థుల సంబురాల‌ను నిర‌సిస్తూ కొంద‌రు స్థానికులు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు

టీ 20 ప్రపంచకప్‌లో (t20 world cup 2021) భాగంగా భారత్- పాకిస్తాన్‌ల (india pakistan match)  మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా దేశంలో కొన్ని ఉద్రిక్త పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలు జరగ్గా.. పలువురు పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో పాక్‌కు మ‌ద్ద‌తు తెలుపుతూ ఉత్తరప్రదేశ్‌లోని (uttar pradesh) ఆగ్రాలోని (agra) రాజా బ‌ల్వంత్ సింగ్ కాలేజీలో (raja balwant singh college) కాశ్మీరీ విద్యార్థులు (kashmir students) సంబురాలు జ‌రుపుకున్న వ్యవహారం దుమారం రేపింది. విద్యార్థుల సంబురాల‌ను నిర‌సిస్తూ కొంద‌రు స్థానికులు ఆగ్రా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు విద్యార్థుల‌ను అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆగ్రా ఎస్పీ మాట్లాడుతూ.. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఈ ఘ‌ట‌న చోటు చేసుకుందని వెల్లడించారు. దేశ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఉపేక్షించ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. విచార‌ణ అనంత‌రం ముగ్గురు క‌శ్మీరీ విద్యార్థుల‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పాకిస్తాన్ విజ‌యం అనంత‌రం ఆ దేశానికి మ‌ద్ద‌తు తెలుపుతూ సంబురాలు నిర్వ‌హించుకున్న వారిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేస్తామ‌ని యూపీ సీఎం (up cm) యోగి ఆదిత్య‌నాథ్ (yogi adityanath) ఇప్పటికే స్ప‌ష్టం చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు జ‌మ్మూక‌శ్మీర్‌లోని (jammu kashmir) నాన్ లోకల్స్‌కు యునైటెడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ( యూఎల్ఎఫ్ ) ఉగ్ర‌వాద సంస్థ (united liberation front) హెచ్చ‌రిక‌లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో భాగంగా ఇండియాపై పాకిస్తాన్ విజ‌యం సాధించడంతో.. శ్రీన‌గ‌ర్‌లో (srinagar) మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబురాలు చేసుకున్నారు. మెడిక‌ల్ స్టూడెంట్స్ సంబురాల‌ను నిర‌సిస్తూ.. కొంత‌మంది పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో యూఎల్ఎఫ్ ఉగ్ర‌వాద సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మెడిక‌ల్ స్టూడెంట్స్‌పై ఎవ‌రు ఫిర్యాదు చేశారో త‌మ‌కు తెలుసని నాన్ లోక‌ల్స్‌ను ఉద్దేశించి యూఎల్ఎఫ్ వ్యాఖ్యానించింది. 48 గంట‌ల్లో క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది. నాన్ లోక‌ల్ ఉద్యోగులు, విద్యార్థులు ఈ ఫిర్యాదుల వెనుక ఉన్న‌ట్లు తెలిసింద‌ని యూఎల్ఎఫ్ ఆరోపించింది. అలాగే ఈ నెల‌లో ద‌క్షిణ క‌శ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో (ananth nag) వ‌ల‌స కార్మికుల‌పై జ‌రిగిన దాడికి తామే బాధ్యుల‌మ‌ని యూఎల్ఎఫ్ ప్ర‌క‌టించింది.

కాగా.. భారత్- పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దాయాది దేశం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. మహ్మద్ రిజ్వాన్ (mohammad rizwan) 55 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా, బాబర్ ఆజమ్ (babar azam) 52 బంతుల్లో 6 ఫోర్లు,  2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అంతేకాకుండా టీమిండియా ఫీల్డర్లకు, బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ కొనసాగించి అజేయంగా 152 పరుగుల భారీ భాగస్వామ్యంతో మ్యాచ్‌ను ముగించారు.. టీమిండియాపై ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు 2012లో డేవిడ్ వార్నర్, షేన్ వాట్సన్ కలిసి తొలి వికెట్‌కి నెలకొల్పిన 133 రికార్డును అధిగమించారు

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం