దారుణం: టెన్త్‌ విద్యార్ధినికి విషమిచ్చి గ్యాంగ్‌రేప్

Published : Jun 07, 2018, 10:53 AM IST
దారుణం: టెన్త్‌ విద్యార్ధినికి విషమిచ్చి గ్యాంగ్‌రేప్

సారాంశం

టెన్త్ విద్యార్ధినిని కిడ్నాప్ చేసి రేప్ చేసిన బంధువులు

చంఢీఘడ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. పదో తరగతి చదువుతున్న
విద్యార్ధినికి విషమిచ్చి మరీ  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు ముగ్గురు దుండగులు. అయితే
గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినవారిలో ఇద్దరు బాధితురాలికి బంధువులు, మరోకరు మైనర్ కావడం
గమనార్హం.

  
హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ జిల్లాలోని భట్టుకలాన్ గ్రామానికిచెందిన పదో తరగతి
బాలికను జూన్ 5వ తేదిన కిడ్నాప్ చేశారు. బాధితురాలి ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలిని ముగ్గురు దుండగులు బాధితురాలిని ఇంటి
నుండి కిడ్నాప్ చేశారు.

ఆ ఇంటికి దూరంగా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి బాధితురాలిపై అత్యాచారానికి
పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడే ముందు బాధితురాలికి ఓ వ్యక్తి  విషమిచ్చాడు.
ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారానికి పాల్పడిన తర్వాత బాధితురాలిని  ఇంటికి సమీపంలో వదిలేసి
పారిపోయారు. ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులకు  కూతురు కన్పించకపోయేసరికి
ఆందోళన చెందారు.ఆమె కోసం వెతికారు. ఇంటికి సమీపంలో బాధితురాలు
ప్రాణాపాయస్థితిలో కన్పించింది.ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆసుపత్రిలో
చికిత్సపొందుతూ బాధితురాలు మృతి చెందింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు నిందితుల్లో మైనర్ బాలుడిని
పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు
చేపట్టారు.

 

     

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే