ముగ్గురు పోలీసులను కాల్చి చంపిన కృష్ణజింకల వేటగాళ్లు.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యవసర సమావేశం..

Published : May 14, 2022, 11:19 AM ISTUpdated : May 14, 2022, 11:29 AM IST
ముగ్గురు పోలీసులను కాల్చి చంపిన కృష్ణజింకల వేటగాళ్లు.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అత్యవసర సమావేశం..

సారాంశం

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం చోటుచేసకుంది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసులును కాల్చిచంపారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసు సిబ్బంది దుండగులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం చోటుచేసకుంది. కృష్ణ జింకల వేటగాళ్లు ముగ్గురు పోలీసులును కాల్చిచంపారు. మృతిచెందిన పోలీసులను ఎస్‌ఐ రాజ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ సంత్రమ్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ‌గా గుర్తించారు. గుణ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. రాష్ట్ర రాజధాని భోపాల్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసు సిబ్బంది దుండగులను పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు. ఈ సంఘటన బాధాకరమైనదని నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

కృష్ణ జింకలను వేటాడేందుకు కొంతమంది వేటగాళ్లు సమీపంలోని అడవిలో ఉంటున్నారని గుణ జిల్లాలోని ఆరోన్ పోలీస్ స్టేషన్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దుండగులు ఉంటున్న చోటుకి చేరుకున్న పోలీసు బృందం అక్కడికి చేరుకుని వారిని చుట్టుముట్టింది. ఈ క్రమంలోనే పోలీసులకు, వేటగాళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే వేటగాళ్లు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతిచెందారు. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడగా..  వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక, అరుదైన జాతులకు చెందిన నాలుగు జింకలను కొందరు దుండగులు చంపినట్లు సమాచారం అందడంతో పోలీసు బృందం సంఘటనా స్థలానికి వెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాస్ ఉన్నతస్థాయి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నారు. డీజీపీ, హోంమంత్రి సహా సీనియర్ పోలీసు అధికారులు , ప్రధాన కార్యదర్శి తదితరులు సమావేశానికి హాజరుకానున్నట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇక, ఈ ఘటనపై శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. నిందితులను దాదాపుగా గుర్తించినట్టుగా చెప్పారు. విచారణ జరుగుతుందని.. నేరస్తులు చట్టం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేనని చెప్పారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం