జమ్మూకాశ్మీర్ లో టెర్రర్ అటాక్.. ముగ్గురు పౌరులు మృతి..

By SumaBala BukkaFirst Published Jan 2, 2023, 9:15 AM IST
Highlights

ఆదివారం సాయంత్రం దంగారి గ్రామం వద్ద ఇద్దరు సాయుధులైన టెర్రరిస్టులు గ్రామస్థులపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు.

రాజౌరీ : జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలోకి ముష్కరులు ప్రవేశించడంతో ముగ్గురు పౌరులు మరణించగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని స్థానికులు చెబుతున్నారు. బాధితులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. తుపాకీ గాయాలతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

ఆదివారం సాయంత్రం డాంగ్రి గ్రామం వద్ద ఇద్దరు సాయుధులు గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. "మూడు ఇళ్లపై జరిగిన కాల్పుల్లో.. ఇద్దరు పౌరులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాం" అని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ చెప్పారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాజౌరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.

ఉగ్రకుట్ర భగ్నం.. భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామగ్రి, డ్రగ్స్ స్వాధీనం.. ఎక్కడంటే..?

10 మంది గాయపడినట్లు రాజౌరి మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. "దురదృష్టవశాత్తు, గాయపడిన వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. వారి ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నాం" అని ఒక వైద్యుడు చెప్పారు. గత రెండు వారాల్లో జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం వెలుపల ఇద్దరు పౌరులు మరణించారు.

click me!