బెంగాల్‌లో కలకలం: బీజేపీ ఎంపీ ఇంటిపై మూడు బాంబులు విసిరిన దుండగులు

Published : Sep 08, 2021, 10:52 AM IST
బెంగాల్‌లో కలకలం: బీజేపీ ఎంపీ ఇంటిపై  మూడు బాంబులు విసిరిన దుండగులు

సారాంశం

బెంగాల్ రాష్ట్రంలోని బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు మూడు బాంబులు విసిరారు. అయితే ఈ దాడి టీఎంసీ పనేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను టీఎంసీ తిప్పికొట్టింది. బీజేపీ నేతల మధ్య విబేధాల కారణంగానే ఈ దాడి జరిగిందని టీఎంసీ ఎదురుదాడికి దిగింది.


కోల్‌కత్తా:పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కత్తాలో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇంటికి సమీపంలో మూడు బాంబులను గుర్తు తెలియని వ్యక్తులు వేశారు. ఈ బాంబుల దాడికి టీఎంసీయే కారణమని బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు.

బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ఇల్లు  కోల్‌కత్తాకు 100 కి.మీ. దూరంలో ఉంది. ఈ ఇంటిపై ఇవాళ ఉదయం బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు బాంబులు వేశారు. ఎంపీ ఇంటి గేటుపై పేలుడు పదార్ధాలను గుర్తు తెలియని వ్యక్తులు ఉంచినట్టుగా సీసీటీవీ వీడియో  దృశ్యాల్లో కన్పించింది.   ఈ విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న అర్జున్ సింగ్ కోల్‌కత్తాకు వెళ్లాడు.ఈ విషయమై గవర్నర్ జగదీష్ ధన్‌కర్ బెంగాల్‌ లో నిరంతరం హింస సాగుతుందన్నారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో హింస తగ్గుముఖం పట్టలేదు. ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వెలుపల బాంబుదాడి ఘటన శాంతిభద్రతలపై ఆందోళన కల్గిస్తోందని ఆయన చెప్పారు. ఈ విషయమై  చర్యలు తీసుకోవాలని ఆయన బెంగాల్ పోలీసులతో పాటు సీఎం మమత బెనర్జీకి కూడ ఆయన ట్యాగ్ చేశారు.మరోవైపు బీజేపీలోని బెంగాల్ నేతల మధ్య విబేధాల కారణంగానే బాంబు దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌