కోతుల గుంపు దాడి.. బీజేపీ నేత భార్య మృతి

Published : Sep 08, 2021, 09:51 AM IST
కోతుల గుంపు దాడి.. బీజేపీ నేత భార్య మృతి

సారాంశం

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. కోతుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. 

కోతుల గుంపు దాడిలో ఓ బీజేపీ నేత  బార్య తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షామ్లీ జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొహల్ల అల్కాలలోని బీజేపీ నాయకుడు అనిల్‌ కుమార్‌ చౌహాన్‌, సుష్మాదేవి (50) భార్యాభర్తలు. భార్య సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఆమె మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి మూడో అంతస్తులో నిలుచుని ఉంది. ఈ సమయంలో కోతుల మంద దాడి చేసింది. 

ఈ సంఘటనతో తీవ్ర భయాందోళనలకు గురైన ఆమె.. కోతుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో.. భవనం నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. మూడో అంతస్తు నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సుష్మ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహించేది. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!