దేశంలో విస్తరిస్తున్న కరోనా.. ఒక్కరోజే నాలుగు లక్షలకు చేరువలో కొత్త కేసులు.. 3,645 మంది మృతి...

By AN TeluguFirst Published Apr 29, 2021, 10:59 AM IST
Highlights

రోజురోజుకూ భారత్ లో పరిస్తితి దయనీయంగా మారిపోతుంది. కొత్తగా పాజిటివ్ నిర్థారణ అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఆందోళనను అధికం చేస్తోంది. తాజాగా 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదై ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్యగా భయపెడుతోంది.

రోజురోజుకూ భారత్ లో పరిస్తితి దయనీయంగా మారిపోతుంది. కొత్తగా పాజిటివ్ నిర్థారణ అవుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఆందోళనను అధికం చేస్తోంది. తాజాగా 24 గంటల్లో 3,79,257 పాజిటివ్ కేసులు నమోదై ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్యగా భయపెడుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,79,257 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,645 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కోవిడ్ కాసేలోడ్ 1.83 కోట్ల కేసులకు పెరిగింది. ఇప్పటివరకు 2.04 లక్షలకు పైగా మరణించారు. పెరుగుతున్న ఈ కేసులతో బాధితులు ఆసుపత్రులను ముంచెత్తుతున్నారు. 

దేశంలో  ప్రతి వారం మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 15 నుండి ఇప్పటివరకు 2 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. కాగా ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, మెడికల్ ఆక్సిజన్ నిండుకోవడం, కీలకమైన యాంటీ-వైరల్ ఔషధాల కొరత కోవిడ్ రోగులను ఇబ్బంది పెడుతోంది.

18 సంవత్సరాలు నిండినవారందరికీ టీకాలని ప్రభుత్వం ప్రకటించిన దీన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది. దీంతో కోవిడ్ వీరవిహారానికి అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ అయిన కోవిన్‌లో బుధవారం ఒక్కరోజే 1.3 కోట్లకు పైగా ప్రజలు కోవిడ్ టీకా కోసం దరఖాస్తు చేసుకున్నారు. 

ఈ సంక్షోభ సమయంలో అమెరికా, యుకె, రష్యా, చైనా భారత్‌కు సహాయ హస్తం అందిస్తున్నాయి. ఈ మేరకు ఒక ట్వీట్‌లో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ జె ఆస్టిన్ III, "భారతదేశ ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ కార్మికులకు మద్దతు ఇవ్వడానికి మాకు చాతనైనంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపారు.

COVID-19 మీద పోరాడటానికి అమెరికా 100 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారతదేశానికి పంపుతున్నట్లు వైట్ హౌస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీటిలో 1,000 ఆక్సిజన్ సిలిండర్లు, 15 మిలియన్ ఎన్ 95 మాస్క్‌లు, 1 మిలియన్ రాపిడ్ టెస్ట్ కిట్ లు ఉన్నాయి.

భారత్ లో చైనా రాయబారి సన్ వీడాంగ్ బుధవారం ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు.. "చైనా వైద్య సరఫరాదారులు భారత్ ఆర్డర్‌లపై ఓవర్ టైం పని చేస్తున్నారు, ఇటీవలి రోజుల్లో ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ల కోసం కనీసం 25000 ఆర్డర్లు వచ్చాయి. వీటిని పంపేందుకు కార్గో విమానాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 

మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కోవిడ్ కేసుల్లో అత్యధికంగా కర్ణాటక, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి..  కర్ణాటకలో 39,000 కేసులను నమోదుకాగా, బెంగాల్‌లో ఒకే రోజు 17,207 కేసులు నమోదయ్యాయి. బెంగాల్ లో ఈ రోజు 35 స్థానాలకు చివరి దశకు పోలింగ్ జరుగుతోంది.

దేశంలోనే కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 985 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రం 63,309 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్యఐదు శాతం పడిపోయింది.  క్రియాశీలకేసులు 6.73 లక్షలకు పైగా ఉన్నాయి. టీకాలు ఇవ్వడంలో వేగం తగ్గితే రాష్ట్రం మూడో వేస్‌ను కూడా చూడవచ్చని నిపుణులు తెలిపారు.

ఇక కేరళలో కొత్తగా 35,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఉత్తర ప్రదేశ్‌లో 29,000 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ వరుసగా రెండవ వారంలో కర్ఫ్యూ లో ఉంది. అయినప్పటికీ 25,986 కేసులు నమోదయ్యాయి.

భారతదేశంలో మొట్టమొదట గుర్తించిన 'బి .1.617' కరోనావైరస్ వేరియంట్.. కనీసం 17 దేశాలలో కనుగొనబడిందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. సెకండ్ వేవ్ వ్యాప్తి దేశంలో ఫస్ట్ వేక్ కంటే వేగంగా విస్తరిస్తోందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, ఇప్పటివరకు దాదాపు 14.96 కోట్ల మంది ప్రజలు  కరోనా బారినపడగా.. 31. 5 లక్షల మంది మరణించారు.

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona

click me!