బాలాకోట్‌‌‌లో 250 మంది ఉగ్రవాదులు మృతి..అమిత్ షా ప్రకటన

By Siva KodatiFirst Published Mar 4, 2019, 1:06 PM IST
Highlights

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ సంచలన ప్రకటన చేశారు. బాలాకోట్‌పై భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మొత్తం 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించారు.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో  పాటు పాకిస్తాన్ భూభాగంపైనా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ముజఫరాబాద్, చకోటీ, బాలాకోట్‌లలో ఉన్నఉగ్రవాద క్యాంపులను ఐఏఎఫ్ ధ్వంసం చేసింది.

అక్కడ తలదాచుకుంటున్న సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు మరణించారని భారత్ ప్రపంచానికి తెలిపింది. అయిటే అటువంటిదేమి లేదని, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడుల్లో కొంతమేర అటవీ ప్రాంతం మాత్రమే నాశనమైందని పాక్ వెల్లడించింది.

ఈ క్రమంలో భారత్‌లోని ప్రతిపక్షాలు సైతం కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఓ సంచలన ప్రకటన చేశారు. బాలాకోట్‌పై భారత వైమానిక దళం చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మొత్తం 250 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. యూరీ ఉగ్రదాడి అనంతరం మన బలగాలు పాకిస్తాన్ వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రతీకారం తీర్చుకుంది. అలాగే పుల్వామా దాడి తర్వాత భారత్ గతంలోలా సర్జికల్ స్ట్రైక్స్‌కు దిగదేమోనని చాలా మంది భావించారు.

కానీ ప్రధాని మోడీ నాయకత్వంలో 13 రోజులకే భారత సైన్యం వైమానిక దాడులు నిర్వహించి బాలాకోట్‌లో 250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిందని వ్యాఖ్యానించారు. అయితే ప్రభుత్వం కంటే ముందు ఒక పార్టీకి జాతీయాధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. ఇంతటి కీలకమైన ప్రకటన చేయడం సంచలనం కలిగిస్తోంది. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

 

click me!