పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నగ్మా

Published : Mar 04, 2019, 12:28 PM IST
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నగ్మా

సారాంశం

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సినీ నటి నగ్మా. 

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు సినీ నటి నగ్మా. కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె.. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. కాగా.. నగ్మా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా.. ఒంటరిగానే జీవిస్తోందని అందరికీ తెలుసు. అయితే.. మీడియాతో చేసిన చిట్ చాట్ లో నగ్మా తన పెళ్లి విషయంపై మనసులో మాట చెప్పింది. 

దేవుడు పెళ్లి జరగాలని రాసిపెడితే తప్పక జరుగుతుందని చెప్పింది. అంతేకాదు ఎవరి జీవితంలో పెళ్లి ఎపుడు కావాలి..? అసలు పెళ్లి ఉంటుందా? ఉండదా? అనే విషయాన్ని దేవుడు ముందే రాసిపెడతాడు. నేను పెళ్లి గురించి నిర్ణయించాల్సి ఏముందంటూ సమాధానమిచ్చింది. తాను మాత్రం పెళ్లికి వ్యతిరేకం కాదని కూడా చెప్పింది నగ్మా. 

PREV
click me!

Recommended Stories

Rahul Gandhi: మరోసారి దద్దరిల్లిన దేశ రాజధాని.. అసలు ఢిల్లీలో ఏం జరుగుతోంది.?
Post Office Scheme: రోజుకు రూ.300 దాచితే చాలు.. చేతికి రూ. 6.42 లక్షలు.. పోస్టాఫీసు అద్భుత స్కీమ్