వాగులో పడ్డ బస్సు: 57 మందికి గాయాలు

Published : Oct 15, 2018, 05:22 PM IST
వాగులో పడ్డ బస్సు: 57 మందికి గాయాలు

సారాంశం

డిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో  సోమవారం నాడు ఓ బస్సులో వాగులో పడింది.

మల్కన్‌గిరి: ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరిలో  సోమవారం నాడు ఓ బస్సులో వాగులో పడింది. ఈ ఘటనలో సుమారు 57 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఒడిశా రాష్ట్రంలోని జైపూర్ నుండి చిత్రకొండకు వెళ్తుండగా సోమవారం నాడు ప్రమాదం సంభవించింది. గోవిందపల్లి వద్దకు రాగానే బస్సుపై డ్రైవర్ నియంత్రణను కోల్పోయాడు. దీంతో బస్సు బ్రిడ్జి నుండి వాగులో పడిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానికులు, అధికారులు సహాయక చర్యలను చేపట్టారు. 

బీఎస్ఎఫ్ జవాన్లు సహాయకచర్యలను చేపట్టారు.  క్షతగాత్రుల్లో  సుమారు 25 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు  అధికారులు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!