దక్షిణాఫ్రికా నుంచి 25 చిరుత పులులను తీసుకురాబోతున్న ప్రభుత్వం

By Mahesh KFirst Published Sep 12, 2022, 6:49 AM IST
Highlights

సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన చిరుత పులులను మధ్యప్రదేశ్‌లోని కేఎన్పీ పార్క్‌లో చేర్చబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వీటిని ఈ పార్క్‌లో చేర్చుతారు. మొత్తం 25 చిరుత పులులను తేవాలని నిర్ణయించుకోగా.. అందులో 8 చిరుత పులుల 17వ తేదీన రానున్నాయి.

భోపాల్: మన దేశంలో చిరుత పులులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు అవి అంతరించిపోయాయి. మన దేశంలోనే కాదు.. ఆసియా ఖండంలోనే అవి లేకుండా పోయాయి. ఇప్పడు వాటిని మళ్లీ రీసెటిల్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా నమీడియా, దక్షిణాఫ్రికాలోని పల ప్రాంతాల నుంచి త్వరలోనే 25 చిరుత పులులను భారత్ తీసుకువచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో పాల్పూర్ నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ఆదివారం తెలిపారు. 

మన దేశానికి 25 చిరుత పులులను త్వరలోనే తీసుకురాబోతున్నట్టు ఆయన వెల్లడించారు. వాటిని మధ్యప్రదేశ్‌లోని కునో పాల్పూర్ నేషనల్ పార్క్‌లో చేరర్చబోతున్నట్టు వివరించారు. ఈ ప్రక్రియ దశల వారీగా ఉంటుందని తెలిపారు. తొలి దశలో భాగంగా సప్టెంబర్ 17 తేదీన ఎనిమిది చిరుత పులులు కేఎన్‌పీకి వచ్చేస్తాయని పేర్కొన్నారు. 

సెప్టెంబర్ 17వ తేదీన జరగాల్సిన ఈ కార్యక్రమం గురించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌లు తెలిపారు. శియోపూర్ జిల్లాలో నిర్మించిన ఎన్‌క్లోజర్‌లలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ చిరుత పులులు వదిలిపెడతారు. 

click me!