చిన్నారిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చంపేశారు.. కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదు

Published : Mar 26, 2022, 02:03 PM ISTUpdated : Mar 26, 2022, 02:09 PM IST
చిన్నారిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చంపేశారు.. కిడ్నాప్, మర్డర్ కేసులు నమోదు

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ చేశాడని ఏకంగా మనిషినే చంపేశారు. ఇంటిలోకి దూరి ఐదు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయగా నరేష్ అనే కుటుంబం దొరకబట్టి నంకు అనే నేపాలీని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడి ఆ తర్వాత మరణించాడు. కాగా, పోలీసులు అటు కిడ్నాప్ కేసు.. ఇటు మర్డర్ కేసు రెండూ ఫైల్ చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటిలోకి వచ్చి చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని గ్రామస్తులు అంతా కలిసి నిందితుడిని చితక బాదారు. చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. కానీ, అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. దీంతో ఆ నిందితుడి తమ్ముడు దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అదే విధంగా తమ చిన్నారిని కిడ్నాప్ చేయడానికి వచ్చాడని చేసిన ఫిర్యాదు ఆధారంగా మృతుడిపైనా కేసు ఫైల్ అయింది.

యూపీలోని గ్రేటర్ నోయిడా కనార్సి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో గురువారం రాత్రి 11 గంటలకు నేపాల్ నుంచి పని వెతుక్కుంటూ వలస వచ్చిన నంకు అనే వ్యక్తి ఓ ఇంటిలోకి చొరబడ్డాడు. ఇంటిలో ఐదు నెలల పాప ఉన్నది. నంకు ఆ పాపను తీసుకుని పారిపోబోతుండగా, చిన్నారి చప్పుళ్లు చేసినట్టు నరేష్ కుటుంబం తెలిపిందని పోలీసులు వివరించారు. పాప ఏడవగానే మేలుకోగా.. నంకు పాపను తీసుకుని పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. వెంటనే ఇరుగు పొరుగు వారిని మేలుకొల్పారు. అందరూ కలిసి కొంత దూరం పరుగెత్తి నంకును పట్టుకున్నట్టు ఆ గ్రామస్తులు వివరించారు.

అందరూ కలిసి నిందితుడు నంకును తీవ్రంగా బాదారు. చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత కూడా మళ్లీ చితకబాదారు. అనంతరం పోలీసులకు విషయం తెలియజేశారు. పోలీసులు నిందితుడు నంకును అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఆయనపై తీవ్ర దాడి జరిగింది. వెంటనే ఆయనను కొట్వాలీ తీసుకెళ్లారు. అక్కడే ఓ ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించారు. అక్కడి సిబ్బంది నంకును జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో పోలీసులు నంకును తీసుకుని జిల్లా హాస్పిటల్‌కు బయల్దేరారు. కానీ, దారి మధ్యలోనే నంకు శ్వాస వదిలినట్టు అదనపు డీసీప విశాల్ పాండే వివరించారు.


కాగా, మృతి చెందిన నంకు సోదరుడు పంచరామ్ పోలీసులను ఆశ్రయించాడు. తన సోదరుడిపై దాడి చేసిన నరేష్ కుటుంబం, ఆయన బంధువులపై మర్డర్ కేసు పెట్టాడు. ఈ కేసును పోలీసులు నమోదు చేసుకుని నంకుపై దాడి చేసిన నరేష్‌ను అరెస్టు చేశారు. ఆయనను కోర్టు ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయనను జైలుకు పంపారు. కాగా, ఈ దాడితో సంబంధం ఉన్న ఇతరుల కోసం పోలీసులు గాలింపులు చేపడుతున్నారు. ఈ అంశంపై దర్యాప్తు జరిపి నిందితులు అందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని వివరించారు.

24 ఏళ్ల నంకు రెండు రోజుల క్రితమే పని వెతుక్కుంటూ నేపాల్ నుంచి భారత్‌కు వచ్చాడు. ఇది వరకు ఇక్కడే ఉన్న సోదరుడితో కలిసి దంకౌర్ ఏరియాలో నివాసం ఉంటున్నాడు.

కాగా, తన చిన్నారిని అపహరించాడనే ఫిర్యాదు ఆధారంగా నంకుపైనా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేయడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu