గుజ‌రాత్ లో దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. కొత్త‌గా ముగ్గురు కార్య‌ద‌ర్శుల నియామ‌కం !

Published : Mar 26, 2022, 01:13 PM IST
గుజ‌రాత్ లో దూకుడు పెంచిన కాంగ్రెస్‌.. కొత్త‌గా ముగ్గురు కార్య‌ద‌ర్శుల నియామ‌కం !

సారాంశం

Congress : గుజార‌త్ పై కాంగ్రెస్ పార్టీ న‌జ‌ర్ పెట్టింది. రాబోయే ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు రాబట్టాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్ కు కొత్త‌గా ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌ను నియ‌మించింది కాంగ్రెస్‌.   

Congress : గుజార‌త్ లో ఒక‌ప్పుడు తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గ‌డ్డుప‌రిస్థితులు ఎదుర్కొంటోంది. ప్ర‌స్తుతం గుజ‌రాత్ పై గురిపెట్టింది కాగ్రెస్ పార్టీ. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టాల‌ని చూస్తోంది. దీని కోసం అప్పుడు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే గుజరాత్‌లో పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముగ్గురు కార్యదర్శులను నియమించింది. ప్ర‌స్తుతం నాయ‌కుల‌ను తొల‌గించింది. ఉమంగ్ సింగర్, వీరేందర్ సింగ్ రాథోడ్, బీఎం సందీప్‌లకు రాష్ట్ర బాధ్యతలు నిర్వహిస్తున్న రఘు శర్మకు సహాయ బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో పార్టీ పని కోసం రామ్‌కిషన్ ఓజా ను కూడా నియ‌మించారు. 

1989 నుంచి గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలో లేదు , గత ఎన్నికల్లో కూడా అధికార బీజేపీని గద్దె దింపలేకపోయింది. అయితే, ఈ సారి జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిల్లో మెరుగైన ఫ‌లితాలు సాధించి.. అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది కాంగ్రెస్‌. కాంగ్రెస్ సీనియ‌ర్ రాహుల్ గాంధీ అధ్యక్షతన ఇటీవల జరిగిన సమావేశంలో, రాష్ట్ర నాయకులు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహరచన గుజ‌రాత్ ఎన్నిక‌ల కోసం తీసుకువ‌చ్చే ఎంపికను ప్రస్తావించారు. అయితే, దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేద‌నీ, పార్టీ సంస్థాగత సమస్యలపై చర్చించడానికి నాయకులు ముందుకు సాగినట్లు  సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

గుజరాత్ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించిన అనంతరం ఇప్పటికే రాష్ట్రానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రాష్ట్రంలోని అన్ని పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. మ‌ళ్లీ రాష్ట్రంలో అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌ధాని స్వ‌రాష్ట్రం, అలాగే, అధికార పార్టీ కావ‌డంతో బీజేపీ అనుకూలంగా ఉండే అవ‌కాశాలున్నాయి. ఇటీలి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలం పార్టీగా బూస్టుగా నిలిచాయి. దీంతో మరింత దూకుడుగా పార్టీ శ్రేణులు కదులుతున్నాయి.  

కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలు రాబట్టింది. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా మెరుగైన ఫలితాలు రాబట్టలేక డీలాప‌డ్డ కాంగ్రెస్‌.. గుజార‌త్ ఎన్నిక‌ల్లో బీజేపీకి గ‌ట్టిపోటీ ఇవ్వ‌డానికి ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. గత ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో డీఎంకే, టీఎంసీ విజ‌యాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కీల‌క పాత్ర పోషించింది. గుజార‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్-ప్రశాంత్ కిషోర్ వ్యూహాల‌ను తీసుకువ‌చ్చే అవ‌కాశాలు బ‌లంగా ఉన్న‌ట్టు ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పలువురు నేతలు కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చలేకపోయారు. 

ఇదిలావుండ‌గా, గుజ‌రాత్ ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప‌లు ప్ర‌జావ్య‌తిరేక చ‌ర్య‌ల‌ను నిర‌శిస్తూ.. ఆందోళ‌న‌కు దిగారు. రైతులకు విద్యుత్ అందుబాటులో లేకపోవడాన్ని నిరసిస్తూ, రాజ్‌కోట్‌లోని ధోరాజీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లలిత్ వసోయా మరియు సోమనాథ్ నుండి విమల్ చుడాస్మా తమ చొక్కాలు  విప్పి నిర‌స‌న తెలిపారు. ఇతర ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో కలిసి వారు ప్లకార్డులతో ప్రదర్శన చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu