బిహార్‌లో పిడుగుల వాన.. 36 గంటల్లో 24 మంది మృతి

Published : Jul 06, 2023, 03:46 PM IST
బిహార్‌లో పిడుగుల వాన.. 36 గంటల్లో 24 మంది మృతి

సారాంశం

బిహార్‌లో భీకర వర్షం కురిసింది. పిడుగులు కురిశాయి. ఈ పిడుగుల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. గడిచిన 36 గంటల్లో 24 మరణించారు. ఒక్క రోజులోనే 15 మంది మరణించినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.  

న్యూఢిల్లీ: బిహార్‌లో భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వేగంగా వీచే గాలులకు తోడు పిడుగులు కురిశాయి. పిడుగుల వల్ల గడిచిన 36 గంటల్లో 24 మంది మరణించారు. మంగళవారం సాయంత్రం నుంచి మొత్తం 8 జిల్లాల్లో 15 మంది మరణించినట్టు అధికారిక ప్రకటన తాజాగా వెల్లడించింది. ఈ ఘటనలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

మంగళవారం సాయంత్రం నుంచి 15 మరణించగా.. మొత్తం గడిచిన 36 గంటల్లో ఈ మృతుల సంఖ్య 24కు పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఏడు జిల్లాల్లో పడ్డ పిడుగుల వల్ల 9 మంది మరణించారు. 

మంగళవారం రాత్రి నుంచి పిడుగుపాటుల వల్ల 15 మంది మరణించారు. రోహతస్ జిల్లాలో ఐదుగురు, కతిహార్‌, గయా, జెహనాబాద్‌లలో ఇద్దరి చొప్పున చనిపోయారు. వీటికితోడు ఖగారియా, కైముర్, బుక్సార్, బగల్‌పూర్‌లలో ఒక్కొక్కరు మరణించినట్టు సీఎం కార్యాలయం వెల్లడించింది.

Also Read: ఢిల్లీ పెద్దలతో బండి సంజయ్ చర్చలు.. రఘునందన్‌రావు పై యాక్షన్‌?

సీఎం నితీశ్ కుమార్ ఈ మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 4 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ భీకర వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సూచనలను పాటించాలని కోరారు. 

ఈ రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. కాగా, ఈశాన్య, నైరుతి బిహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కరుస్తాయయని చెబుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం