నరేంద్ర మోడీ గత 9 ఏళ్ల కాలంలో పేదరికం 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయట పడ్డారు.
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్లలో 24.82 కోట్ల మంది భారతీయులు పేదరికం నుండి బయట పడ్డారని నీతి ఆయోగ్ ప్రకటించింది. 2013-14 లో భారత దేశంలో పేదరికం 29.17 శాతం నుండి 2022-23 లో పేదరికం 11.28 శాతానికి తగ్గింది. 2013-14 నుండి 2022-23 వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చినట్టుగా నీతి ఆయోగ్ తెలిపింది. నీతి ఆయోగ్ సీఈఓ బీ.వీ.ఆర్. సుబ్రమణ్యం ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ మేరకు సోమవారం నాడు చర్చా పత్రాన్ని విడుదల చేశారు.
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. 2013-14 లో 29.17 శాతం నుండి 2022-23 వరకు 11.28 శాతానికి పేదరికం తగ్గింది. పేదరికం 17.89 శాతం పాయింట్లు దగ్గింది. గత తొమ్మిదేళ్లలో 5.94 కోట్ల మంది పేదరికం నుండి బయట పడ్డారని నీతి ఆయోగ్ చర్చా పత్రం తెలిపింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేదరికం నుండి బయటపడ్డారు. ఆ తర్వాతి స్థానంలో బీహార్ రాష్ట్రం నిలిచింది. బీహార్ రాష్ట్రంలో 3.77 కోట్ల మంది, మధ్యప్రదేశ్ లో 2.30 కోట్ల, రాజస్థాన్ లో 1.87 కోట్ల మంది పేదరికం నుండి బయట పడ్డారు.
2005-06 నుండి 2015-16 తో పోలిస్తే 7.69 శాతం పేదరికం తగ్గింది. 2015-16 నుండి 2019-21 మధ్య 10.66 శాతం తగ్గింది. ఎంపీఐ సూచికల మేరకు 12 అంశాల్లో గణనీయమైన మెరుగుదలను నమోదు చేశాయి.గత 9 ఏళ్లలో అన్ని కార్యక్రమాలను అమలు చేయడంతో 24.82 కోట్ల మంది పేదరికం నుండి బయట పడ్డారని నీతి ఆయోగ్ చర్చా పత్రం తెలిపింది.2023 నాటికి పేదరికం నుండి బయటపడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.
also read:తమిళనాడు మధురైలో జల్లికట్టులో 36 మందికి గాయాలు: పోటీలు ఎలా నిర్వహిస్తారో తెలుసా?
అన్ని కోణాల్లో పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రజల జీవితాలను మెరుగుపర్చడంలో విశేషమైన పురోగతిని సాధించింది. పోషణ్ అభియాన్ , రక్తహీనత ముక్త్ భారత్ వంటి కార్యక్రమాలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు ప్రజలకు ఉపయోగపడ్డాయని ఈ చర్చా పత్రం తెలిపింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం కింద 81.35 కోట్ల మంది లబ్దిదారులకు రేషన్ అందించడం కూడ పేదరికం నుండి బయట పడేలా చేసింది. గ్రామీణ, పట్టణ జనాభాకు ఆహార ధాన్యాలను కూడ ప్రభుత్వం అందిస్తుంది. మరో ఐదేళ్ల పాటు ఈ పథకం ఆహార ధాన్యాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
also read:పేదల కోసమే పదేళ్లుగా అంకితం: రూ. 540 కోట్లు విడుదల, గిరిజనులతో మోడీ ముచ్చట
మాతా శిశు ఆరోగ్యం, ఉజ్వల యోజన ద్వారా స్వచ్ఛమైన వంట ఇంధనం, జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలు ప్రజల జీవన స్థితిగతులను మార్చాయని ఈ చర్చా పత్రం తెలుపుతుంది.ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన, పీఎం ఆవాస్ యోజన వంటి కార్యక్రమాలు పేదలకు ఉపయోగపడ్డాయని ఈ చర్చా పత్రం తెలుపుతుంది.సాంప్రదాయకంగా అధిక పేదరికాన్ని కలిగి ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు కూడ పేదరికం నుండి బయట పడ్డారని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాల అసమానతలను తగ్గించాయి.